Spurt in India’s vaccination drive draws global praise లేటుగా స్టార్ట్ చేసినా.. ఇండియా లేటెస్ట్ రికార్డు

Spurt in india s vaccination drive draws global praise us europe left behind

vaccination drive, Coronavirus, pandemic, covid vaccine, covaxin, Covishield, Dr Harshavardhan, PM Modi, Corona Vaccine

The Covid-19 vaccination drive which started floundering in May has again gathered momentum and is leaving behind the most developed nations including the US & Europe, where most vaccine producing companies are based.

వాక్సీన్లు వేయడంతో అగ్రరాజ్యాన్ని అధిగమించిన భారత్.!

Posted: 06/28/2021 04:43 PM IST
Spurt in india s vaccination drive draws global praise us europe left behind

కరోనా వ్యాక్సినేషన్ వేయడంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. లేటుగా స్టార్ట్ చేసినా.. లేటెస్టుగా రికార్డులను సోంతం చేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం టీకాలు వేయడంల్లో అగ్రరాజ్యం అమెరికాను దాటేసింది. ఏప్రీల్ మాసాంతంలో, మే నెలలో టీకాలు ఎక్కడా.. అని ఎదురుచూసిన దేశప్రజలు ఇప్పుడు అనేక వాక్సీనేషన్ కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్నారన్న సమాచారంతో ఊరట చెందుతున్నారు. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో వాక్సీన్లు అందుబాటులో లేకుండా పోగా, అన్ లాక్ లతో వాక్సీన్లు అనేక చోట్ల లభిస్తున్నాయి.

ఉచితంగా కోవీషీల్డ్ వాక్సీన్ అందుబాటులో వుండగా, తెలంగాణ అందులోనూ హైదరాబాద్ లో పలు ప్రైవేటు అసుపత్రుల్లో మాత్రం కోవాగ్జీన్ అందుబాటులో వుంది. ఇక థర్డ్ వేవ్ మరింత ప్రభావాన్ని చాటుతుందని, అత్యంత తీవ్రంగా వుంటుందన్న వార్తల నేపథ్యంలో వాక్సీన్ల వేయించుకునేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఇప్పటిదాకా మన దేశంలో 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 డోసుల టీకాలు వేయగా.. అమెరికాలో 32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసులు వేశారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, వ్యాక్సినేషన్ క్రమంలో అమెరికా కన్నా తక్కువ టైంలోనే అన్ని డోసులు వేయడం విశేషం.

అమెరికా అన్ని డోసులు వేయడానికి ఆరు నెలలు పడితే.. మనకు కేవలం ఐదు నెలల టైమే పట్టింది. అంటే అమెరికా కన్నా నెల ముందే ఆ మార్కును భారత్ అధిగమించింది. డిసెంబర్ 14న అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలవగా.. భారత్ లో జనవరి 16న ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితం 86 లక్షల డోసుల టీకాలేసి ఒక్కరోజులోనే అత్యధిక టీకాలేసిన రికార్డును సాధించింది భారత్. అయితే, ఆ తర్వాత టీకా కార్యక్రమం మళ్లీ స్లో అయింది. నిన్న 13.9 లక్షల మందికి ఫస్ట్ డోస్ టీకా వేశారు. మరో 3.3 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. మొత్తంగా 17.21 లక్షల డోసుల వ్యాక్సిన్ నే ప్రజలకు వేశారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటోందని, ఈ ఘనతలో భాగమైన వారందరికీ అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు వేయడమే తమ ప్రాధాన్యమని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమాజం, ప్రభుత్వం అండతోనే ఈ ఘనత సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వివిధ దేశాలతో పోలుస్తూ వ్యాక్సినేషన్ లో భారత్ ఏ స్థానంలో ఉందో గ్రాఫ్ ను ట్వీట్ చేశారు. అందులో భాగంగా కేంద్రమే అందరికీ ఫ్రీగా టీకాలు వేస్తోంది. ప్రైవేటులో వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే పేదవారికి ఉచిత టీకా కోసం ఈవోచర్లనూ అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles