Rahul Gandhi questions Centre's strategy on Delta Plus ధర్డ్ వేవ్ రాకుండా తీసుకన్న చర్యలేంటీ: కాంగ్రెస్

Rahul gandhi questions centres preventive measures of delta plus variant

Rahul Gandhi, Modi Government, Union Government Stratagy on Third wave, central government strategy on deltaplus corona, Coronavirus, Covid-19, deltaplus coronavirus symptoms, delta plus coronavirus, delta coronavirus, coronavirus delta variant, cdc coronavirus update, rt-pcr test, covaxin registration, covaxin, covid.gov.in registration,

Congress MP Rahul Gandhi questioned if the Centre had a strategy to deal with the Delta Plus variant of the coronavirus disease in case a third wave of the pandemic hits. “Why is testing not being done to detect and control the strain? When will we get complete information on vaccine efficacy on the variant?” he asked.

డెల్టా ప్లస్ వేరియంట్ నివారణ చర్యలేంటీ.?: కేంద్రానికి రాహుల్ ప్రశ్న

Posted: 06/25/2021 01:39 PM IST
Rahul gandhi questions centres preventive measures of delta plus variant

కరోనా ధర్డ్ వేవ్ పై దేశప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న క్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో థర్డ్ వేవ్ రాకుండా కేంద్రప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలను తీసుకుందని ఆయన ప్రశ్నించారు. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆయన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. కొవిడ్‌-19 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు మోడీ సర్కార్ ఎలాంటి ముందస్తు నివారణ చర్యలకు పూనుకుందో దేశప్రజలకు వివరించాలని ఆయన ప్రశ్నించారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు, నిరోధానికి పెద్ద ఎత్తున ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు.

ఈ వేరియింట్ అత్యంత ప్రభావితమైనదన్న వార్తల నేపథ్యంలో దీనిని కట్టడి చేసే సామరధ్యం టీకాలు వుందా.? అయితే ఎంతమేర ప్రభావాన్ని టీకాలు చూపగలుగుతాయన్న వివరాలను కూడా ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పుడు లభిస్తుందని ఆయన ప్రశ్నలు సంధించారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు నియంత్రించే ప్రణాళిక ఏంటీ? అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. దేశంలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాలు బాధిత జిల్లాల్లో నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. డెల్టా లేదా B.1.617.2 వేరియంట్‌లోని మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ ఉత్పరివర్తనం చెందిందని.. అయితే దాని తీవ్రత ఇంకా తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles