Five held for murder of six across Krishna district పోలీసులు అదుపులో ఆరుగురు వృద్దులను హత్యచేసిన గ్యాంగ్

Five member gang arrested for 6 murders robberies

robberies, murder gang, Auto drivers, ATM Theft, Penamaluru, Kanchikacherla, Krishna district, Police Commissioner, B Sreenivasulu, Velpuri Prabhakar Kumar, Sunkara Gopi Raju, Ponamala Chakravarthy, Chakri, Moram Naga Durga Rao, Chanti, Tadigadapa, Maddhi Phanindra Kumar,Kamayya Thopu, Vijayawada Police, Andhra Pradesh, Crime

In a major development, Vijayawada Police arrested a gang of five youth for committing robberies and murdering six elderly persons across Penamaluru and Kanchikacherla PS limits in Krishna district.

పోలీసులు అదుపులో దోపిడీ ముఠా... ఆరుగురు వృద్దులను హత్యచేసిన గ్యాంగ్

Posted: 06/25/2021 11:42 AM IST
Five member gang arrested for 6 murders robberies

ఈజీ మనీ కోసం అన్వేషణలో దోపిడీలకు అలవాటు పడి జల్సాలు చేస్తున్న దోపిడీ ముఠా.. శివారు ప్రాంతాల్లోని ఒంటరి మహిళలను, వృద్దులను టార్గెట్ చేసి వారిని ఊపిరి ఆడనీయకుండా హతమార్చి.. ఆధారాలు లేకుండా చేసి అక్కడి నుంచి తప్పించుకు తిరిగే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత తొమ్మిది నెలల్లో ఆరుగురిని హత్య చేసిన ఈ ముఠా మరో 12 మందిని టార్గెట్ చేసిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అనూహ్యంగా కటకటలా వెనక్కి నెట్టారు. వంద గొడ్లను తిన్న రాబందు చిన్న గాలివానకు రాలినట్లు.. ఆరు హత్యలు, దోపిడీలు చేసిన ముఠా చిన్న చోరి కేసులో చిక్కింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న విజయవాడ శివారు పోరంకిలోని ఏటీఎంలో కొందరు యువకులు చోరీకి యత్నించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్ చక్రవర్తి అలియాస్ చక్రిని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తాను ఏటీయం చోరికి యత్నించినట్లు అంగీకరించాడు. అయితే అతడికి సహకరించిన మిగతా దొంగలు ఎవరన్న విషయంలో పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించారు. అతడిచ్చిన సమాచారంతో ముఠాలోని మిగిలిన యువకులనూ అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వేలిముద్రలను పరిశీలించగా గతేడాది కంచికచర్లలో జరిగిన వృద్ధ దంపతుల హత్యకేసులో నమోదైన నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. దీంతో పోలీసులు తమ శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్, గోపీరాజు, చక్కవర్తి, నాగదుర్గారావు ఆటో డ్రైవర్లు. ఫణీంద్ర కుమార్ పెయింటర్. వ్యసనాలకు బానిసలైన వీరందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉదయం  ఆటో నడుపుతూ, కూరగాయలు అమ్ముతూ రెక్కీ నిర్వహించేవారు. ముఖ్యంగా కాలనీలకు దూరంగా ఉంటున్న ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి హత్య చేసి అందినంత దోచుకునేవారు.

గత ఏడాది అక్టోబరులో పోరంకి విష్ణుపురం కాలనీకి చెందిన నళిని (58)ని హత్య చేసి దోచుకున్నారు. అయితే తమ దొంగతనం, హత్య బయటకు రాకపోవడంతో చెలరేగిపోయిన గ్యాంగ్ సభ్యులు.. తొమ్మిది నెలల్లో ఆరుగురిని హత్య చేసి డబ్బు, బంగారు నగలను దోచుకున్నారు. అనంతరం బాధితుల ఇళ్లపై నిఘా పెట్టి.. పోలీసులు వచ్చారా? లేదా అన్న విషయాలు తెలుసుకునేవారు. అంత్యక్రియల వరకు అక్కడే గడిపివారు. మరో 12 మందిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారు. హత్యలు చేసి వారింట్లోని బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను దొంగిలించి వాటిని తాకట్టు పెట్టి జల్సాలు చేసే ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles