ICU patient bitten by rat at Rajawadi hospital dies ఆసుపత్రి ఐసీయూలో రోగిని క‌రిచిచంపిన ఎలుక‌లు..!

Patient bitten by rat in mumbais civic hospital dies mayor orders probe

Mumbai news, Mumbai rat bite, Rajawadi hospital, mumbai rat bite death, Rajawadi Hospitalm, Hospital Dies, Probe Launched, hospital hygiene news, BMC, Rat, ICU ward, Patient, death, Rajawadi Hospital, Mumbai, BMC, Maharashtra, Crime

A 24-year-old patient, who was bitten by a rat near his eye at a civic-run hospital in suburban Ghatkopar, has died at the medical facility, BMC officials said. The patient was suffering from alcohol-related liver disease and was in a very critical condition since the day of his admission in the Rajawadi Hospital, they said, adding that he died.

వైద్యసిబ్బంది నిర్లక్ష్యం: ఐసీయూలో రోగిని క‌రిచిచంపిన ఎలుక‌లు..!

Posted: 06/24/2021 04:08 PM IST
Patient bitten by rat in mumbais civic hospital dies mayor orders probe

మ‌హారాష్ట్ర రాజ‌ధాని నగరం.. దేశ ఆర్థిక రాజధానిగా బాసిల్లుతున్న నగరం ముంబైలో దారుణం జ‌రిగింది. ఘాట్కోపర్ లో బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ కు చెందిన రాజావాడి ఆస్పత్రిలో అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు క‌రిచి చంపేశాయి. ఆస్ప‌త్రి ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగిని ఎలుక‌లు కొరికి చంప‌డం తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. అత్యవసర పరిస్థితి వార్డులోని రోగిని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకోవాల్సిన వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణ ఘటన సంభవించిందని రోగుల బంధువులు అరోపిస్తున్నారు.

ఈ విష‌యం తెలిసి ఐసీయూలోని మిగతా రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు మృతుడి బంధువులు ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఆస్ప‌త్రి ముందు ధ‌ర్నాకు దిగారు. ఏకంగా ఆస్ప‌త్రి ఐసీయూలో ఎలుకలు దూరడంతోపాటు.. బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగిని కొరికి చంప‌డం యాజ‌మాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న‌ద‌ని మండిప‌డ్డారు. కాగా, ఈ ఘటనను బీఎంసీ పరిపాలనా విభాగం సీరియస్‌గా తీసుకున్నదని, ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశామ‌ని ముంబై మేయర్‌ కిశోరీ పెడ్నేకర్ చెప్పారు.

మృతి చెందిన రోగి బంధువులు, కుటుంబసభ్యులు కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.. కుర్లా కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండ‌టంతో కుటుంబసభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయ‌ని చెప్పి ఐసీయూలో చేర్పించి చికిత్స మొద‌లుపెట్టారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ కంటి కింది భాగం నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు రోగి సోద‌రి గమనించింది.

వెంటనే విష‌యాన్ని ఆమె త‌న బంధువుల‌కు చెప్ప‌డంతో వారు ఆస్పత్రి సిబ్బందిని నిల‌దీశారు. దాంతో ఎలుక క‌ర‌వ‌డంతో గాయం అయ్యింద‌ని, దానివ‌ల్ల పెద్ద ప్ర‌మాదం ఏమీ లేద‌ని చెప్పారు. కనీసం అప్పట్నించైనా ఐసీయూలోని పేషంట్ల వద్దకు ఎలుకలు రాకుండా అసుపత్రి సిబ్బంది చర్యలు చేపట్టాల్సింది. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. 24 గంట‌లు కూడా గ‌డువ‌క‌ముందే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తాము అసుపత్రి సిబ్బంది దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా.. ఫలితం లేకుండాపోయిందని మృతుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. అసుపత్రి సిబ్బందే నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని రోదిస్తున్నారు.

ముంబై మేయ‌ర్‌ కిశోరి పెడ్నేకర్‌ కు విషయం తెలియడంతో ఆయన వెంటనే ఆస్పత్రికి వెళ్లి వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అయితే ఈ అసుపత్రిలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇది తొలిసారి కాదని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో కూడా ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కొరికేశాయి. ఆ త‌ర్వాత‌ మార్చురిల్లో కూడా ఎలుక‌లు శవాలను గుర్తుపట్టలేనంతగా కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rat  ICU ward  Patient  death  Rajawadi Hospital  Mumbai  BMC  Mumbai  Maharashtra  Crime  

Other Articles

Today on Telugu Wishesh