అదృష్టం మీ వంతులో ఉంటే అది భూమి పోరల్లో దాగి వున్నా వచ్చి చేరుతుందని పెద్దలు చెప్పేవాళ్లు. సరిగ్గా అదే జరిగిందీ ఈ మత్స్యాకారుడికి. సముద్రంలో చేపల వేట ఒక్కో రోజు ఓక్కో అనుభవాన్ని మిగిల్చుతుంది. రోజంతా వేట కొనసాగినా ఓసారి నిరాశతో వెనుతిరగాల్సి రావొచ్చు. మరోరోజూ అనుకోని విధంగా ఆశించిన దానికంటే ఎక్కువే దక్కొచ్చు. ఈ విధంగానే ఓ యువ మత్స్యకారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేటలో అతడికి పెద్ద చేప దొరకడమే కాదు. దాని లోపల అనుకోని విధంగా మద్యం ఫుట్ బాటిల్ కూడా లభించింది.
లక్కీ మ్యాన్.. క్యాచ్ ఆఫ్ ది డే అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. చేపల వేట అనంతరం ఓ పెద్ద చేపను మత్స్యకారుడు బోటులోని టేబుల్‌పై ఉంచి కత్తితో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇలా చేపను కట్ చేసి శుభ్రపరుస్తుండగా చేప కడుపు లోపలి భాగాల్లో అనుకోని విధంగా ఓ ఆబ్జెక్ట్ ఉన్నట్లుగా గుర్తించాడు. కత్తితో కోసి చూడగా విస్కీ ఫుల్ బాటిల్ బయటకు వచ్చింది. దీంతో అతని సంతోషానికి అవదులు లేకుండా పోయాయి.
టిక్‌టాక్ యూజర్ బెనిబాన్ దీన్ని పంచుకోవడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియో దాదాపు 6 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. అయితే వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియరాలేదు. కాగా ఈ వీడియో ఆన్లైన్లో చర్చకు దారితీసింది. బాధ్యతా రహితమైన మానవ ప్రవర్తన ఇలా జంతుజలాలకు ఏ విధంగా ముప్పును కలిగిస్తుందో స్పష్టమౌతుందని పేర్కొన్నారు. మరికొందరు ప్రచారం కోసం అతడే చేప కడుపులో బాటిల్ చొప్పించి ఉండవచ్చని వాదిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more