FIR against Ramdev for remarks on allopathy medicine అలోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాందేవ్ పై కేసు

Fir against baba ramdev for spreading false information on allopathy

Baba Ramdev, IMA, Ramdev FIR news, Allopathy, Ramdev spread misinformation, Raipur news, Chattisgarh, Crime

Police in Chhattisgarh’s Raipur have registered an FIR against yoga guru Ramdev for allegedly spreading “false” information about the medicines being used by the medical fraternity for the treatment of Covid-19, police official said on Thursday.

బాబా రాందేవ్ పై ఎఫ్ఐఆర్.. అలోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 06/17/2021 05:48 PM IST
Fir against baba ramdev for spreading false information on allopathy

అల్లోపతి వైద్యంపై సత్యదూరమై ప్రచారాలను చేస్తూ.. వివాదాలకు కారణమైన యోగ గురువు బాబా రాందేవ్ పై చత్తీస్ గడ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యావత్ దేశం కరోనా మహమ్మారి ధాటికి భయాందోళన చెందుతున్న తరుణంలో అలోపతి వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాప్ అందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మారి కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తుండగా, వారి వైద్య విధానాన్ని చులకన చేసి మాట్లాడిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐెఎంఏ) దాఖలు చేసిన పిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అలోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ.. ఆయన చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాందేవ్ వ్యాఖ్యలపై అల్లోపతి వైద్యులు దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టారు. ఇటీవల ఐఎంఏ నేతలు ఆయనపై దాఖలు చేసిన రూ.1000 కోట్ల పరువు నష్టం దావా కేసులో కాసింత వెనక్కు తగ్గిన బాబా రాందేవ్.. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఆదే సమయంలో తనపై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన వైద్యులకు ఆయన భారీ జలక్ ఇచ్చారు. తనను అరెస్టు చేసే ధమ్ము ఎవరికీ లేదని అన్నారు.

ఇదిలా ఉంటే రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ లో పోలీస్ కేసు నమోదైంది. ఐఏంఏ చత్తీస్‌గఢ్ యూనిట్‌ ఫిర్యాదుపై రాందేవ్‌పై కేసు నమోదైనట్టు రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. రాందేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో హాస్పిటల్ బోర్డ్ ఐఎంఏ చైర్మన్ డాక్టర్ రాకేశ్ గుప్తా, ఐఎంఐ రాయ్‌పూర్ అధ్యక్షుడు వికాశ్ అగర్వాల్ తదితరులు ఉన్నారు. కాగా ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  IMA  Ramdev FIR news  Allopathy  Ramdev spread misinformation  Raipur news  Chattisgarh  Crime  

Other Articles