CBI questions close aids of YS Viveka on 11th day వైఎస్ వివేకా హత్యకేసులో 11వ రోజు సన్నిహితుల విచారణ

Cbi questions close aids of ys vivekananda reddy on 11th day

Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The CBI officials, who were camping in the guest house belonging to Kadapa central prison, reportedly questioned the Close aids of former Minister YS Vivekananda Reddy, for the Eleventh consecutive day.

వైఎస్ వివేకా హత్యకేసులో స్పీడు పెంచిన సీబిఐ.. 11వ రోజు సన్నిహితుల విచారణ

Posted: 06/17/2021 03:10 PM IST
Cbi questions close aids of ys vivekananda reddy on 11th day

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబిఐ అధికారులు వేగం పెంచారు. కడప జిల్లా కేంద్ర కారాగారానికి చెందిన గెస్ట్ హౌజులో మకాం వేసిన అధికారులు బృందం గత 11వ రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే వారి పది రోజుల విచారణలో పలు కీలక అంశాలను సేకరించిన వీరు మరింత సమాచారం కోసం స్పీడు పెంచారు. ఈ విచారణలో బాగంగా ఇవాళ సీబీఐ బృందం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. అయితే ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం.

వీరిలో పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డితోపాటు మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో అరెస్టై కొద్దీ రోజుల క్రితం జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు గంగిరెడ్డి. ఇతడు వివేకానంద హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదురుకుంటున్నారు. దీంతో అతడిని గురువారం విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

ఇక జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వివాహానంద రెడ్డి వ్యవసాయ పనులు మొత్తం ఇతడే చూసుకుంటారు. ప్రతి రోజు వివేకాను కలిసి అతడి బాగోగులు చూస్తూనేవారు. హత్య జరిగిన రోజు కూడా ఉదయం 6 గంటలకు వివేక ఇంటికి వెళ్లారనే సమాచారం ఉండటంతో సీబీఐ అధికారులు జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇక గంగాధర్ అనే వ్యక్తి పులివెందులకు చెందిన గనుల వ్యాపారి. ఇతనితో కూడా వివేకాకు స్నేహం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గంగాధర్ ను ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles