dresses as woman, rape accused murders survivor ‘ఆడ’వేషంలో వచ్చి బాధితురాలిని హత్యచేసిన అత్యాచార నిందితుడు

Accused rapist allegedly murders rape victim for not withdrawing complaint

jodhpur, sirohi, rape, sexual assault, murder, kill, rapist, accused, alleged, widow, woman, sister, arrest, jodhpur rape accused murders woman, rape survivor murder, rape survivor murder jodhpur, rajasthan jodhpur, rajasthan rape survivor murder, rajasthan, india, crime

An accused rapist who was out on bail was arrested in India's Rajasthan state Monday after he allegedly fatally stabbed the woman he was accused of raping last year, police said. The man, identified by authorities as Netram, allegedly stabbed the unnamed victim to death late Saturday at her house in the village of Nagani located in Sirohi district,

‘ఆడ’వేషంలో వచ్చి బాధితురాలిని హత్యచేసిన అత్యాచార నిందితుడు

Posted: 06/15/2021 05:45 PM IST
Accused rapist allegedly murders rape victim for not withdrawing complaint

పొరుగింటి మహిళపై అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవించిన నిందితుడు.. బెయిలుపై విడుదలైన తనువాత బాధితురాలిని తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోమ్మని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని చంపేస్తానని కూడా హెచ్చరించాడు. అయితే వాటిని పెడచెవిన పెట్టిన బాధితురాలిని హెచ్చరించిన విధంగానే చంపేశాడు. ఓ మహిళ వేషంలో వచ్చిన నిందితుడు బాధితురాలి ఇంట్లోకి వెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్న బాధితురాలు తన ఇద్దరి పిల్లలతో ఇంట్లో నివాసముంటుందన్న విషయం తెలుసుకుని అమెపై దారుణానికి ఒడిగట్టాడు.  

రాజస్థాన్ లోని సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్, తన ఇంటి పోరుగునే నివాసం ఉంటున్న వితంతు మహిళపై కన్నువేశాడు. తన ఇద్దరి పిల్లలతో ఒంటిరిగా నివాసం ఉంటున్న బాధిత మహిళను లోబర్చుకునేందుకు పలు వేషాలు వేశాడు. అయితే అందుకు అమె లోంగలేదు. దీంతో గత ఏడాది అమె ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. దీంతో అమె తన బంధువులతో కలసి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన నేత్రమ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గత కొంతకాలం వరకు అండర్ ట్రయల్ ఖైదీగా వున్న అతను ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చాడు.

అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బాధితురాలు ఓ వితంతువు. ఇద్దరు పిల్లలు, చెల్లెలుతో కలిసి నివసిస్తోంది. గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన నేత్రమ్... నిద్రిస్తున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన బాధితురాలు మరణించింది. పోలీసులు నేత్రమ్ కోసం తీవ్రంగా గాలించి, సోమవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sirohi  rape  sexual assault  murder  kill  rapist  accused  alleged  widow  woman  sister  arrest  rajasthan  india  crime  

Other Articles

Today on Telugu Wishesh