Karnataka Man walks to hospital with cobra that bit him కాటేసిన త్రాచుపాముతో ఆసుపత్రికి వచ్చిన బాధితుడు

Man in karnataka s ballari walks into hospital with cobra that bit him

kadappa, upparahalli village, kampli taluk primary health centre, anti venom injection, VIMS hospital, cobra snake, agricultural field, cobra bite, Ballari, viral video, video viral, Karnataka, crime

Staffers of a primary health centre in Ballari's Kampli taluk were in for a shock when a 30-year-old man walked in with a cobra in his hand. Eyewitnesses said that Kadappa, from Upparahalli village, came to PHC with the snake that had bitten him in his hand, a video of which has since gone viral.

కాటేసిన త్రాచుపాముతో ఆసుపత్రికి వచ్చిన బాధితుడు

Posted: 06/14/2021 06:00 PM IST
Man in karnataka s ballari walks into hospital with cobra that bit him

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కాంప్లి తాలుకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాము కాటుతో బాధపడిన ఓ బాధితుడు పిహెచ్సీలోకి ప్రవేశించగానే అతడ్ని చూసిన సిబ్బంది దూరంగా జరగడంతో పాటు కెవ్వు మంటూ కేకలు వేశారు. తీరా అసలు విషయం తెలిసిన తరువాత ఔరా అంటూ అతడ్ని ప్రశంసించడంతో పాటు అతడి ధైర్యానికి మొచ్చుకున్నారు. అసలేం జరిగిందీ అంటే ఓ యువకుడ్ని నాగుపాము కాటేయగా, ఆ యువకుడు ఎంతో ధైర్యంగా పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు. ఉప్పరహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు.

అతడిని కరిచింది నాగుపాము కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ కాడప్ప ఏమాత్రం భయపడకుండా ఆ తాచుపామును పట్టుకుని స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. కరించింది నాగుపాము అని తెలిసినా పామును పట్టుకుని ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందీ అంటే.. సాధారణంగా గ్రామల్లోని వ్యవసాయ భూముల్లో వుండే ఎలుకలను అన్వేషిస్తూ పాములు సంచరించడం సాధారణమే. అయితే పాము కాటేసిన బాధితులు అసుపత్రులకు వెళ్లిన సమయంలో అక్కడి వైద్యులు కరిచింది ఏ పాము అని అడగటం కామన్. అప్పుడు ఏం చెప్పినా.. ఒకటికి రెండు సార్లు నిర్థారించుకున్నాక కానీ లేదా.. కరిచింది ఏ పామో కరించిందో దాని విష లక్షణాల ప్రభావం బయటపడే దాక అగిన తరువాత కానీ వైద్యులు చికిత్సను చేయరు.

అయితే ఇది ఎంతో ప్రమాదకరం. ఈ విధానం వల్ల బాధితులు ప్రాణాలపైకి తీసుకువచ్చే ప్రమాదం కూడా వుంటుంది. ఈ క్రమంలో కాడప్ప తనను కాటేసిన తాచు (నాగు)పామును చెత్తే పట్టుకుని తన బంధువు సాయంతో అతని స్కూటర్ పై కూర్చోని నేరుగా కాంప్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. అక్కడ వైద్య సిబ్బంది అతనికి యాంటి వెనమ్ ఇంజక్షన్ ను ఇచ్చి ప్రథమ చికిత్స అనంతరం విమ్స్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. ఆ తరువాత అక్కడి గ్రామస్థులు కాడప్పను నాగుపామును వదిలి పెట్టాలని కోరగా, అతను సమీపంలోని చెట్ల పోదల మధ్య దానిని వదిలిపెట్టాడు. ఆ తరువాత తన బంధువు స్కూటర్ పైనే విమ్స్ అసుపత్రికి వెళ్లాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles