High Court Justice Shinde apologized to lawyer Jayashree Patil మహిళా న్యాయవాదికి హైకోర్టు న్యాయమూర్తి క్షమాపణలు

Justice shinde of bombay hc apologises for harsh words following advocate jayshree patil s complaint

jayshree patil, Advocate, justice shinde, bombay high court, anil deshmukh case, Chief Justice of India, apology, Humiliated, complaint

Advocate Jayshree Patil had on May 5 registered a complaint with the Chief Justice of India and the Bombay High Court against Justice SS Shinde. She alleged that he insulted and humiliated her. During a hearing, Justice Shinde apologised for his “harsh words” and she, in turn, promised to take back her complaint.

మహిళా న్యాయవాదికి హైకోర్టు న్యాయమూర్తి క్షమాపణలు

Posted: 06/09/2021 03:32 PM IST
Justice shinde of bombay hc apologises for harsh words following advocate jayshree patil s complaint

ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా తప్పులు చేయాల్సిందే. అయితే చేసిన తప్పులను తెలుసుకుని పశ్చాతాపం చెందినవారే నిజమైన మనిషి. ఇక ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేసిన వారే పుణ్యపురుషులు. ఇలా తాను చేసిన తప్పును తెలుసుకున్న ఓ న్యాయమూర్తి.. తన కోర్టులోని ఓ సాధారణ మహిళా అడ్వకేట్ కు క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. బాంబే హైకోర్టులో ఈ ఘటన జరిగింది. జస్టిస్ న్యాయవాదికి క్షమాపణలు చెప్పడంతో ఆయన హుందాతనం మరింత పెరిగిందని న్యాయనిపుణులు పేర్కోంటుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో స్వయంగా న్యాయమూర్తి తనకు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో జయశ్రీ పాటిల్ అనే మహిళా న్యాయవాది సదరు న్యాయమూర్తిపై చేసిన పిర్యాదును ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎస్ షిండేపై.. అమె మే నెల 5వ తేదీన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వద్ద పిర్యాదు రిజిస్టర్ చేయించారు. తాను ఓ పిటీషన్ సమర్పించే క్రమంలో న్యాయమూర్తి తనను చులకనగా చూశారని, అందువల్ల తాను అవమానం పాలయ్యానని అమె పేర్కొన్నారు. కాగా, సుమారు నెల రోజుల తరువాత ఈ విషయమై ఓ కేసు విచారణ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి అమెకు క్షమాపణలు చెప్పారు. దీంతో న్యాయవాది తన పిర్యాదును ఉపసంహరించుకుంటానని తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మార్చి నెలలో జయశ్రీ పాటిల్ కోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పారు. ఆ పిటీషన్ లో తాను మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లానని కాకపోతే అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేయడం లేదని తేల్చేశారు. జస్టిస్ షిండె నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ వింటూ.. కాపీ-పేస్ట్ చేసి పిటిషన్ పట్టుకొచ్చేశారా.. అనడమే కాకుండా.. చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేశారా అని ప్రశ్నించారు. పాటిల్ పిటిషన్ ఆ తర్వాత ఏప్రిల్ లో చీఫ్ జస్టిస్ దీపంకర్ దత్తా బెంచ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మాజీ హోం మంత్రిపై కంప్లైంట్ చేసేందుకు ముందుకొచ్చిన ఆమెను ప్రశంసించారు.

మంగళవారం అనిల్ దేశ్ ముఖ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారణ జరిపింది. పాటిల్ మాట్లాడుతూ తాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకోలేదని చెప్పారు. దాంతో పాటు తన పిటిషన్ ను ఒక్క జస్టిస్ షిండ్ బెంచ్ మినహాయించి ఏ బెంచ్ తో అయినా విచారణ జరిపించాలని కోరారు. ఇతర సీనియర్ లాయర్ల సమక్షంలో జరిగిన విచారణ తర్వాత తాను చేసిన కామెంట్లకు జస్టిస్ షిండే విచారం వ్యక్తం చేశారు. ‘కోర్టు అంటే లాయర్లు, జడ్జిలతో ఓ కుటుంబంలా భావిస్తాం. ఒక్కోసారి మాటలు బాధించవచ్చు. దానికి విచారం వ్యక్తం చేస్తున్నా’ అని షిండే అన్నారు. ఆ మాటలకు పాటిల్ కూడా తన కంప్లైంట్ వెనక్కు తీసుకుంటానని మాటిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles