17 killed, six hurt in road accident in UP's Kanpur: Police కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి..

17 killed six hurt in road accident in up s kanpur says police

Kanpur road accident, Kanpur bus accident, Kanpur accident latest news, yogi adityanath, PM Modi, kanpur accident, Kanpur, Uttar Pradesh, Crime

Kanpur road accident: According to the police, the bus was travelling from Lucknow to Delhi and collided with an auto coming from the opposite direction. The collision was so strong that almost all passengers of the bus got trapped and sustained serious injuries, the police said.

కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి..

Posted: 06/09/2021 10:35 AM IST
17 killed six hurt in road accident in up s kanpur says police

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదఘటనలో మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి, క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సుకు సచేంది ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న యూపీ రోడ్ వేస్‌ కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు.. జేసీబీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ తీవ్రతకు జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు బ్రిడ్జి పై నుంచి పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులతో ఉన్న బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు చాలా వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పునఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ప్రమాదఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur road accident  Kanpur bus accident  yogi adityanath  PM Modi  Kanpur  Uttar Pradesh  Crime  

Other Articles