HC strikes down Navneet Kaur-Rana’s caste certificate అమరావతి ఎంపీ కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు

Bombay hc cancels fake caste certificate of amravati mp navneet kaur

Navneet Kaur-Rana, fake caste certificate, fake caste certificate navneet kaur, amravati mp, amravati mp fake caste certificate, bombay high court, mumbai news, mumbai latest news, Mumbai, Maharashtra, Politics, crime

The Bombay high court (HC) on Tuesday set aside the November 2017 decision of the Mumbai suburban district caste scrutiny committee, validating caste claim of Navneet Kaur-Rana, an independent Member of Parliament from Amravati, that she belonged to Mochi community, a Scheduled Caste.

అమరావతి ఎంపీ కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు

Posted: 06/08/2021 03:09 PM IST
Bombay hc cancels fake caste certificate of amravati mp navneet kaur

మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నవనీత్ కౌర్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. అంతేకాదు అమె పార్లమెంటు సభ్యత్వం కూడా రసకందాయంలో పడింది. అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆమెకు రూ.2 లక్షల జరిమానా విధించింది. దీంతో అమకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఎస్సీ కాదంటూ మంగళవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

విచారణ సందర్బంగా నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం జస్టిస్ ఆర్డీ ధనుకా, విజి బిష్ట్ ల డివిజన్ బెంచ్ రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానాను ఎంపీ మహారాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈక్రమంలో నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ సంచలన తీర్పుని వెలువరించింది.

నవనీత్ కౌర్ ఎస్సీ కాదని తేల్చిన న్యాయస్థానం.. అమె కుల ధ్రువీకరణ రద్దు చేసింది. దీంతో అమె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరు వచ్చే అవకాశాలు వున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ అభ్యర్థులకు రిజర్వు చేయబడింది. అయితే నవనీత్ కౌర్ ఎస్సీ కాదని న్యాయస్థానం తేల్చిన నేపథ్యంలో తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం వచ్చింది. అయితే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టును ఆశ్రయిస్థానని ఎంపీ నవనీత్ కౌర్ తీర్పు అనంతరం తెలిపారు.

కాగా. గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం తెలిసిందే. పార్లమెంటులో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తామని ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని..శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లెటర్స్ కూడా వస్తున్నాయని… ఫోన్ చేసి కూడా బెదిరిస్తున్నారని గతంతో నవనీత్ కౌర్ ఆరోపించారు. దీనిపై నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles