Apple Gives Student Million-Dollar Settlement విద్యార్థిని ‘ఆ’ ఫోటోలు లీక్.. పరిహారం ఇచ్చిన యాపిల్.!

Apple gives student million dollar settlement after nude photos leaked

Apple, Apple Lawsuit, apple million dollar lawsuit, apple settlement, iphone lawsuit, iphone leaks nudes, iphone nudes leaked, iphone user lawsuit

Apple has reportedly paid a million-dollar settlement deal to an iPhone owner, after two service centre executives reportedly posted nude photos and videos on her Facebook profile, after she sent it for repair.

విద్యార్థిని ‘ఆ’ ఫోటోలు లీక్.. పరిహారంగా రూ.36 కోట్లు ఇచ్చిన యాపిల్.!

Posted: 06/08/2021 11:24 AM IST
Apple gives student million dollar settlement after nude photos leaked

యాపిల్ కు చెందిన ఐ ఫోన్ ఒక బ్రాండ్. మార్కెట్లో బ్రాండ్ వాల్యూను పెంపోందించుకోవడమే చాలా ముఖ్యం. ఒక్కసారి బ్రాండ్ కు వాల్యూ పెరిగిందా.. దానిని కాపాడుకోవడంపైనే అన్ని సంస్థలు దృష్టి పెడతాయి. ఆ బ్రాండ్ వ్యాల్యూ కోసం ఎంతటి ఖర్చు అయినా భరిస్తాయి. అదే బ్రాండ్ కు బీటాలు వారుతున్నాయని తెలిస్తే.. దానికి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడతాయి. అవసరమైతే క్షమాపణలు చెప్పడమే కాదు పరిహారాలు కూడా ఇచ్చేస్తాయి. ఇక స్మార్ట్ ఫోన్లలో యాపిల్ సంస్థకు చెందిన ఐ ఫొన్ కు కూడా ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ చాలానే సోంతం చేసుకుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ పోన్ వినియోగాదారులందరికీ తెలిసిందే.

అలాంటి బ్రాండ్ ఇమేజ్ కు బీటాలు వారుతున్నాయని, తెలియడంతో దిద్దుబాటు చర్యల్లోకి దిగిన యాపిల్ సంస్థ ఏకంగా రూ.36 కోట్ల రూపాయలను చెల్లించేందుకు రెడీ అయ్యింది. యాపిల్ సంస్థ బ్రాండ్ ఇమేజ్ ను నమ్మిన ఓ విద్యార్థిని తన ఐ ఫోన్ పాడవ్విన కారణంగా రిపేరు చేసేందుకు ఇచ్చింది. అయితే అందులో అమె దాచుకున్న తన నగ్న ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో యాపిల్ సంస్థ 36 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని ఒరేగావ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఐఫోన్ పాడైపోవడంతో 2016లో పెగట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న ఐఫోన్ సర్వీస్ సెంటర్‌లో మరమ్మతు కోసం ఇచ్చింది.

ఫోన్‌ను మరమ్మతు చేసిన అక్కడి టెక్నీషియన్లు అందులో ఉన్న యువతి నగ్న ఫొటోలు, వీడియోలు చూసి వాటిని తస్కరించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఆ ఫొటోలు చూసిన యువతి స్నేహితులు విషయాన్ని ఆమెకు చేరవేయడంతో దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత యువతి కోర్టుకెక్కింది. పరిహారంగా 5 మిలియన్ డాలర్లు (రూ. 36 కోట్లు) ఇప్పించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో యాపిల్ ఆ మొత్తాన్ని యువతికి పరిహారంగా చెల్లించింది. యాపిల్ చెల్లించిన ఈ సొమ్మును సర్వీస్ సెంటర్ పెగట్రాన్ నుంచి రాబట్టుకున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles