Curfew to replace lockdown in Telangana..? తెలంగాణలో లాక్ డౌన్ స్థానంలో కర్ప్యూ.?

Curfew from 7pm to 6 am to replace lockdown in telangana

coronavirus, covid 19, lockdown, telangana lockdown, lathicharge, police lathicharge, K chandrasekhar rao, m mahender reddy, Telangana lockdown, Hyderabad lockdown, Curfew replacing Lockdown, Strict Curfew in Telangana, Evening to morning curfew in telangana, CM KCR, cabinet meet, Telangana, Crime

According to sources Telangana Chief Minister K Chandrashekar Rao is held a meeting and take a decision on Lockdown in the State, There is a news doing rounds that CM KCR to replace Lockdown in the state with Curfew from 7PM to 6 AM of next day for about 10 days.

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. సాయంత్రం నుంచి తెల్లవారేవరకు కర్ప్యూ.?

Posted: 06/07/2021 11:16 AM IST
Curfew from 7pm to 6 am to replace lockdown in telangana

కరోనా వైరస్ రెండో దశ అత్యంత వేగంగా విస్తరిస్తున్న తరుణంలోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవసరమే లేదని బీరాలు పోయిన ప్రభుత్వం.. క్రమంగా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతూ మృతుల సంఖ్య కూడా పెరగడంతో కట్టడికి చర్యలు తీసుకుంది. ఇందులో బాగంగా గత్యంతరం లేక రాష్ట్రంలో అకస్మాత్తుగా గత నెల 12న లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలుత వారం రోజులు ఆ తరువాత పది రోజుల పాటు కేవలం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలింపుతో లాక్ డౌన్ ప్రకటించగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభనకు కట్టడి పడింది. లాక్ డౌన్ ఫలితంగా రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు గత నెల 31 నుంచి ఈ నెల 9 వరకు ఉదయం పూట ఆరు గంటల నుంచి మధ్యహ్నాం ఒంటి గంట వరకు ఆ తరువాత మరో గంట ఇళ్లకు చేరుకునేందుకు సడలింపులు కల్పిస్తూ మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను పోడగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం భేటీ కానున్న మంత్రివర్గం లాక్ డౌన్ పోడగింపుపై నిర్ణయం తీసుకోనుంది. కాగా వైద్య అరోగ్యశాఖ అధికారులు కూడా రేపు తమ నివేదికను మంత్రివర్గానికి అందించనున్నారని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింత సమయాన్ని సడలించాలని పలువర్గాలకు చెందిన వారు కూడా కోరుతున్నారు.

అయితే వ్యాపారులు, ఇతరుల అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. కాగా కొందరు మాత్రం ప్రస్తుతం ఒంటిగంట వరకు సడలింపులు ఉండగా, దీనిని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ స్థానంలో పూర్తిగా కర్ప్యూను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను ఎత్తివేసి.. సాయంకాలం ఏడు గంటల నుంచి తెల్లవారు జామూ ఆరు గంటల వరకు కర్ప్యూను అమల్లోకి తీసుకురావాలని, ఇక కర్య్పూను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. అలాగే, ఆ సమయంలో రోడ్లపై ఉన్న వారు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మరో గంట సమయం ఇవ్వాలని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid 19  lockdown  Curfew  KCR  telangana CM  cabinet meet  Telangana  crime  

Other Articles