Etala Rajender to join BJP on 13 June బీజేపిలో చేరికకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్న ఈటెల

Former minister etala rajender to join bjp on 13 june

Etela Rajender resigns from TRS, Etela Rajender to join BJP, Telangana minister, Etala Rajender, KCR, CM KCR, TRS, Telangana movement, BJP, JP Nadda, Bandi Sanjay, Raghunanadan Rao, Talangana, politics

Former Telangana Health Minister Etela Rajender who resigned from Telangana Rashtra Samithi is joining the BJP on 13 June in the presence of BJP National President JP Nadda. Etala was sacked and dropped from the Cabinet on May 1 over allegations of land grabbing in Medak district — said that he was unfairly targeted by the party.

బీజేపిలో చేరికకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్న ఈటెల రాజేందర్

Posted: 06/07/2021 09:41 AM IST
Former minister etala rajender to join bjp on 13 june

తెలంగాణ ఉద్యమంలో తాను ఓ సమిధనై పోరాడి సాధించినా.. అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీలో ఏడేళ్లు మంత్రిగా చేసినా.. తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట తాను మనజాలనని పేర్కొంటూ టీఆర్‌ఎస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 13న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన గత శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది వారసత్వ పార్టీ కాదని, ఉద్యమ పార్టీ అని ఉద్యమ సమయంలో పదే పదే చెప్పిన కేసీఆర్.. దానిని వారసత్వ పార్టీగా మార్చే ప్రయత్నాలు చేస్తూ తమలాంటి వారిని పక్కనబెట్టే కార్యక్రమాన్ని చేబట్టారని అన్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయంోల కొనసాగిన వారు ఎవరూ లేరని, అలె నరేంద్ర మొదలుకుని అప్పటి నాయకగణాన్ని మొత్తం పూర్తిగా బయటకు పంపిన కేసీఆర్.. ఇప్పడు మాత్రం వలసవాదులతో పార్టీని నడుపుతున్నారని అన్నారు. వీరంతా కేసీఆర్ ను ఎన్ని రకాలుగా తిట్టారో, ఎన్ని దుర్భాషలాడారో పార్టీ అధినాయకులు మర్చిపోయి వుండవచ్చు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మర్చిపోలేదని, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకునేందుకు వారంతా వేచిచూస్తున్నారని అన్నారు. ఇక ఈ నెల 8, లేదంటే 9వ తేదీల్లో బీజేపీలో చేరుతానని ప్రకటించారు. అయితే, తాజాగా 13న బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etala Rajender  KCR  CM KCR  TRS  Telangana movement  BJP  JP Nadda  Bandi Sanjay  Raghunanadan Rao  Telangana  Plitics  

Other Articles