gods golden idol found to farmer in his agriculture farm పోలంలో బంగారు విగ్రహం.. జంతువును బలిచ్చిన రైతు అరెస్టు

Gods golden idol found to farmer in his agriculture farm

Gold And Silver Ornaments, gold idol, Mulugu District, Realtor strikes gold, telangana, tresure hunt, Muppanapally village, Kannayigudem, Mulugu, Telangana

A Farmer was held by the police from Muppanapally village of Kannayigudem mandal in Mulugu district of Telangana after he claims that god appeared in his dream and said to find golden idol in his agriculture farm. For which he had sacrified an animal.

పోలంలో బంగారు విగ్రహం.. జంతువును బలిచ్చిన రైతు అరెస్టు

Posted: 06/05/2021 01:49 PM IST
Gods golden idol found to farmer in his agriculture farm

అప్పుడప్పుడు ప్రకృతిలోని పంచభూతాలు కూడా సామాన్యులను అదృష్టవంతులుగా చేస్తాయన్న వార్తలు వింటూవుంటాం. వర్షం కురిస్తే వజ్రాలు బయటపడటం, పొలం పనులు చేస్తున్న సమయంలో గుప్త నిధులు లభ్యం కావడం,, పాత ఇళ్లను మరలా నిర్మించే ప్రక్రియలోనూ పురాతణ నాణేలు లభించడం వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ బంగారు విగ్రహం లభ్యమైంది. దీనిని ఆ రైతు మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తున్నాడు.ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు విచారణ చేపట్టి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ములుగు జిల్లా కన్నాయిగూడం మండలం ముప్పనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్ల నారాయణ అనే వ్యక్తి గుప్త నిధుల కోసం బుట్టాయిగూడెంకు చెందిన మరో వ్యక్తితో కలిసి తన పొలంలో తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది. దీంతో అతడు దానిని తీసుకోని ఇంటికి వెళ్లి పూజలు చేయడం ప్రారంభించాడు. అయితే నారాయణ పొలంలో జంతు బలి జరిగిన విషయం గ్రామస్థుల దృష్టికి వచ్చింది. వెంటనే నారాయణ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గుప్త నిధుల తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు పొలం యజమాని నారాయణ ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు బంగారం విగ్రహం కనిపించడంతో నారాయణను విచారించారు. దీంతో నారాయణ అసలు విషయం బయట పెట్టాడు. తనకు మే నెలలో తన పొలంలో మల్లన్న విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందని.. అందుకనే మరో వ్యక్తి సహాయంతో మే 26 పొలంలో తవ్వకాలు జరిపానని చెప్పాడు. ఆ తవ్వకాల సమయంలో ఈ విగ్రహం దొరికిందని వివరించాడు. దీంతో విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపై అతనికి సహకరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles