Telangana Govt to impliment new zonal system తెలంగాణలో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు..

Cm kcr to impliment employment policy to grant 95 govt jobs to locals

central Government, multi-zone, new zonal system, telangana public employment, telangana zones, Employment, Hyderabad, Telangana

The Telangana government to impliment the new zonal system approved by the Central government for the recruitment of staff into State government services. A gazette notification was released enabling the State government to provide 95 per cent reservations in all the State-level recruitment to the people of Telangana State under the new zonal system.

స్థానికులకే 95శాతం ఉద్యోగాలు.. త్వరలో అమలు చేయనున్న సర్కారు

Posted: 06/04/2021 11:15 AM IST
Cm kcr to impliment employment policy to grant 95 govt jobs to locals

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలో అమలు కానున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్‌ సీఎం కేసీఆర్‌ దగ్గరికి వెళ్లింది. ఆయన సంతకం చేయగానే సవరణ ఉత్తర్వులను అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేస్తుంది. అప్పటి నుంచి జోనల్‌ వ్యవస్థలో చేపట్టిన సవరణలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం గతంలో 31 జిల్లాలకు ఉన్న జోనల్‌ ఉత్తర్వులు 33 జిల్లాలకు వర్తిస్తాయి. 2018 ఎన్నికల తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలిపారు.

నూతన జోనల్‌ వ్యవస్థలో నియామకాలన్నీ తెలంగాణ నిరుద్యోగ యువతకే లభిస్తాయి. త్వరలో ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, 5 శాతం ఓపెన్‌ క్యాటగిరీని పొందుపరిచారు. 5 శాతంలోనూ తెలంగాణ నిరుద్యోగ యువత పోటీ పడవచ్చు.నియామకాల్లో తెలంగాణ యువతకే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలతో సుదీర్ఘంగా కసరత్తు చేసి, ఓపెన్‌ క్యాటగిరీని 5 శాతానికే పరిమితం చేశారు. దీంతో ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే దక్కనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles