Loyal Elephant Bids Farewell to Mahout మావటి కోసం కదిలివచ్చింది.. హృదయాలను ధ్రవింపజేస్తున్న గజరాజు..

Heartwarming video of elephant bidding farewell to mahout who died of cancer

Elephant bid farewell to mahout, Kunnakkad Damodaran death, Elephant bidding farewell to pappaan, Pallat Brahmadathan farewell to Omanachettan, Elephant videos, Elephant during mahout funeral, Viral video, elephant, mahout, death, farewell, kerala, Kottayam, Lakkattoor, Omanachettan, Brahmadathan, Kottayam, Kerala, Trending news

In a heart-warming video that is making rounds on the internet, an elephant was seen bidding farewell to his loving mahout who lost his battle against cancer. The incident, which happened in Kottayam, Kerala saw the elephant named Pallat Brahmadathan paying last respects to his master Omanachettan, as locals watched on with teary eyes.

ITEMVIDEOS: మావటి కోసం కదిలివచ్చింది.. హృదయాలను ధ్రవింపజేస్తున్న గజరాజు..

Posted: 06/04/2021 09:38 AM IST
Heartwarming video of elephant bidding farewell to mahout who died of cancer

కొన్ని జంతువులు, మనుషుల మధ్య అనుబంధం విడదీయలేనిది. ఇలా మనుషులతో పెనవేసుకున్న అనుబంధాన్ని సర్వసాధారణంగా వన్యప్రాణులు మాత్రం చూపించలేవు. ఇంట్లో వుండే పెంపుడు జంతువులు వాటి ప్రేమను చూపిన ఘటనలు అనేకం. కానీ తమకు కూడా ఆప్యాయతను పంచి ఇచ్చిన మనుషులపై మమకారాన్ని మాత్రం ఏ జంతువు మర్చిపోదు. ఇదీ అనుబంధాలకు, అప్యాయతలకు వున్న బంధం. తమ యజమానుల పట్ల మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. ఇలాంటి ప్రేమను పంచిన తమ మాస్టారు ఇక లేరన్న వార్త తెలిసిన ఓ గజరాజు ఏం చేసిందో తెలుసా..

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆ మావటి కుటుంబ సభ్యుడు ఏనుగును చూసి కన్నీటిపర్యంతమయ్యాడంటే ఆ కుటుంబానికి, ఏనుగుకు మధ్య ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది.

ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. ఆ మావటి పేరు కున్నక్కడ్ దామోదరన్ నాయర్. 74 ఏళ్ల నాయర్ ను స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఏనుగు పేరు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న కన్నుమూశాడు. ఈ సందర్భంగానే ఆ గజరాజును దాని యజమాని మావటి ఇంటికి తీసుకువచ్చారు. ఏనుగు బ్రహ్మదత్తన్ నివాళులు అర్పిస్తుండడాన్ని స్థానికులందరూ శోకతప్త నయనాలతో వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elephant  mahout  death  farewell  kerala  Kottayam  Lakkattoor  Omanachettan  Brahmadathan  Kottayam  Kerala  Viral Video  

Other Articles