YS Jagan files counter in CBI court సీబిఐ కోర్టులో 98 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఎం జగన్

Ys jagan files counter in cbi court over bail cancellation petition

YS Jagan, YSRCP, Raghu Rama Krishna Raju, CBI, YS Jagan Mohan Reddy bail, YS Jagan Mohan Reddy bail cancellation, AP CM YS Jagan, YSR Congress Party president, disproportionate assets case, CBI Special Court, Narsapuram YCP MP, Raghurama Krishnam Raju, Jagan Mohan Reddy, Jagan Mohan Reddy news, Jagan Mohan Reddy in CBI court, YS Jagan Mohan Reddy cases, andhra pradesh, politics

Andhra Pradesh chief minister and YSR Congress Party president Y S Jagan Mohan Reddy told a special court of CBI in Hyderabad that he had not threatened or influenced any witness directly or indirectly in an alleged disproportionate assets case being probed against him

సీబిఐ కోర్టులో 98 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఎం జగన్

Posted: 06/01/2021 05:36 PM IST
Ys jagan files counter in cbi court over bail cancellation petition

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబిఐ న్యాయస్థానంలో కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. 98 పేజీల కౌంటర్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు తన బెయిల్ రద్దు పిటీషన్ ను తోసిపుచ్చాలని అభ్యర్థించారు. తాను బెయిల్ పై వచ్చినా తన కేసుకు సంబంధించి ఏ ఒక్క వ్యక్తిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బెదిరించలేదని, కనీసం వారిపై ఎలాంటి ఒత్తిడిని కూడా తీసుకురాలేదని ఆయన తన కౌంటర్ పిటీషన్ లో పేర్కోన్నారు. కాగా వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు గతంలోనే ఆదేశించినా... కొన్ని కారణాల వల్ల ఆయన తరపు న్యాయవాదులు మూడు వాయిదాల వరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయారు. దీంతో, గత విచారణ సందర్భంగా కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోయినా... విచారణను ప్రారంభిస్తామని హెచ్చరించింది. దీంతో, ఈరోజు వారు కౌంటర్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ... సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన సందర్భాలు ఉన్నాయని రఘురాజును ఉద్దేశించి అన్నారు.

రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని... ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారని తెలిపారు. రఘురాజుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన అంశంలో రఘురాజుపై సీబీఐ కేసు కూడా నమోదు చేసిందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకునే ప్రయత్నాన్ని రఘురాజు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు సీబీఐ కూడా ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది. రఘురాజు వేసిన పిటిషన్ పై చట్టప్రకారం తగు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. కోర్టు తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని విన్నవించింది. అనంతరం, కేసు విచారణను కోర్టు 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles