Cyclone Yaas makes landfall on Odisha coast ఒడిశా, బెంగాల్ ‘యాస్’ బీభత్సం.. వేల ఇళ్లు నేలమట్టం..

Cyclone yaas weakens after pounding odisha west bengal coasts

cyclone yaas, cyclone yaas news, cyclone yaas update, India Meteorological Department (IMD), Bay of Bengal, cyclone yaas update today, cyclone yaas track, cyclone yaas tracker, cyclone yaas in west bengal, cyclone yaas in odisha, East Coast Railway, IMD, East Coast Railway, Paradip, Balasore, Digha, Odisha, West Bengal

Cyclone Yaas, which intensified into a "very severe cyclonic storm", hit the Odisha, and will take two hours to cross over. This is the second cyclone to hit the country in a week, after Cyclone Tauktae killed more than 150 people. It comes as India is already struggling to deal with its Covid-19 outbreak. Yaas lashed coastal areas with ferocious wind and rain as it made landfall, damaging buildings

ఒడిశా, బెంగాల్ ‘యాస్’ బీభత్సం.. వేల ఇళ్లు నేలమట్టం..

Posted: 05/26/2021 12:30 PM IST
Cyclone yaas weakens after pounding odisha west bengal coasts

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా.. తుపానుగా.. అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశాలోని బాలాసోర్, చాంధీపూర్ ల మధ్య తీరం దాటింది. ఈ క్రమంలో ఒడిశా సహా పశ్చిమ బెంగాల్ లోని అనేక ప్రాంతాల్లో యాస్ బీభత్సం సృష్టించింది. యాస్ తీరం ధాటే సమయంలో 155 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. యాస్ అతి తీవ్ర తుపానుగా మారడంతో తీరం దాటే సమయంలో పెను భీభత్సం సృష్టించింది.

తుపాను కారణంగా చాంద్‌బలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావంతో ఓ వైపు ఒడిశా, బెంగాల్, సహా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి.  ఇప్పటికే ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా జార్ఖండ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బెంగాల్ లో మొదలైన వర్షాలు కుండపోతగా మారి రాష్ట్రాన్ని ముంచేస్తున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని నదులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వేగంగా వీస్తున్న గాలులకు అనేక చెట్లు నెలకూలాయి. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వర్షాల ధాటికి కపిల్​ ముని మందిరం నీట మునిగింది. వర్షాలకు తోడు పెను గాలులు తోడవ్వడంతో విధ్వంసమే జరిగింది. అయితే ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుండగా, వరుణుడు శాంతించక ముందే రంగంలోకి దిగిన అధికారులు ఆస్తినష్టం ఏమేరకు ఉందని అంచనాలు వేయడానికి రంగంలోకి దిగారు. ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సంతో నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా తుఫాన్ ప్రభావాన్ని అధికంగా వున్న లోతట్టు ప్రాంతాల వద్ద సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నారు. ఫౌర్ణమి నాడు సహజంగా సముద్రం అలలు ఎగసిపడుతుంటాయి. దానికి పెను తుపాను కూడా తోడు కావడంతో మరింత రెట్టించిన వేగంతో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyclone yaas  IMD  East Coast Railway  Paradip  Balasore  Sagar Island  Digha  Odisha  West Bengal  

Other Articles