Twitter office 'raid' 'murder' freedom of speech: Congress ట్విట్టర్ పై దాడి.. భావప్రకటన స్వేచ్చపై దాడేనన్న ప్రతిపక్షాలు

Police at twitter s door after bjp posts flagged opposition slams intimidation

Twitter India, Toolkit case Twitter, Twitter BJP Sambit Patra, Twitter India Delhi Police raid, Delhi Police Twitter raid, BJP Twitter India, Congress, NCP, TMC, ShivSena, National Politics

DAYS after Twitter flagged some posts by ruling party leaders as “manipulated media”, a team of Delhi Police’s Special Cell Monday working under the Union Home Ministry — knocked on the doors of Twitter India’s Delhi and Gurgaon offices to ostensibly serve the social media platform a notice.

ట్విట్టర్ ఆఫీసుపై పోలీసుల దాడి.. భావప్రకటన స్వేచ్చపై దాడేనన్న ప్రతిపక్షాలు

Posted: 05/25/2021 01:06 PM IST
Police at twitter s door after bjp posts flagged opposition slams intimidation

ఢిల్లీలో ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడులు నిర్వహించడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. రాత్రి వేళ జరిగిన ఈ పరిణామం వివాదానికి దారితీసింది. అధికార అండతో బీజేపి ప్రాథమిక హక్కులకు సైతం విఘాతం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు తూర్పారబడుతున్నాయి. బీజేపీ నేత సంబిత్ పాత్రా ట్వీట్ కు మానిప్యూలేటెడ్ మీడియా అనే ట్యాగ్‌ జత చేసి ఆ పోస్టులు నకిలీవని నిర్ధారించింది. ఇలాంటి ప్లాగ్ పెట్టిన రోజుల వ్యవధిలో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఈ అంశంపై ట్విటర్ నుంచి వివరణ కోరారు పోలీసులు.

ట్విటర్ ఇండియా వద్ద తమకు తెలియని సమాచారం ఉందని, అందుకే పాత్రా ట్వీట్ కు మ్యానిపులేటెడ్ ట్యాగ్ వేసిందని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమాచారం ఏంటో తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ఢిల్లీ , గుర్గావ్ లోని ట్విట్టర్‌ ఇండియా కార్యాలయాలపై ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ దాడులు నిర్వహించింది . అనంతరం ట్విట్టర్‌ సంస్థ ప్రతినిధులకు నోటీసులు అందజేశారు పోలీసులు. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాట్రా ట్వీట్ ను మానిప్యులేటెడ్‌ మీడియా అని లేబుల్‌ చేసిన తర్వాత.. పోలీసులు ట్విట్టర్‌ ఇండియాకు లేఖ పంపిన ఒకరోజు తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గమన్నాయి.

ఇప్పటికే టూల్ కిట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ టూల్‌కిట్ సృష్టించి ప్రధాని మోడీతో పాటు దేశ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తుందని బీజేపీ ఆరోపించింది. కరోనా కొత్త రకానికి భారత్ స్ట్రెయిన్, మోదీ స్ట్రెయిన్ పేర్లతో ప్రచారం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దీనికి బీజేపీ నేతలు వంతపాడడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయం అగ్గి రాజేసుకుంది. అయితే, బీజేపీ ఆరోపణను కాంగ్రెస్ ఖండించింది. నకిలీ టూల్ కిట్ ను బీజేపీ ప్రచారం చేస్తోందని పేర్కొంది. ట్విట్టర్ కార్యాలయాలపై దాడులు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కాంగ్రెస్ విమర్శించింది.

ట్విట్టర్‌ సంస్థకు, కేంద్ర ప్రభుత్వానికి రెండు, మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది అంటూ.. ఓ టూల్ కిట్ నూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దాని ప్రకారం.. దేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు కాంగ్రెస్ టూల్ కిట్ రూపొందించిందని బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. అటువంటి ట్వీట్లకు మ్యానిపులేటెడ్ మీడియా అంటూ ట్విట్టర్ ట్యాగ్ ను జత చేస్తోంది. విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిదే కానీ లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పడం సహేతుకం కాదని, దీనిని అలానే వదిలేయలేమని ట్విట్టర్ ఆలాంటి సందేశాలకు ఫ్లాగ్ చేయడంతో అసలు వివాదానికి కారణమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles