Coronavirus New Strain Can Infect Your Eye Cells కళ్లపై కూడా కరోనా ప్రభావం.. అత్యంత ప్రమాదకరం: అధ్యయనం

Coronavirus new strain can infect your eye cells

Coronavirus New Strain, Eye Cells, SARS-CoV-2, Covid-19, face masks, Mount Sinai Hospital researchers, cells in the eye, directly infected, ocular fluid, Timothy Blenkinsop, Assistant Professor Mount Sinai, journal Cell Stem Cell, vitro stem cell

Coronavirus is primarily a respiratory infection, but experts have suspected that the virus can also infect your eye cells. A team of US researchers has, in an alarming study, found direct evidence that Covid-19 is harming your cells in the eye.

కళ్లపై కూడా కరోనా ప్రభావం.. అత్యంత ప్రమాదకరం: అధ్యయనం

Posted: 05/20/2021 12:52 PM IST
Coronavirus new strain can infect your eye cells

కంటికి కనిపించని శత్రువుతో గత ఏడాదిన్నర కాలంగా యావత్ ప్రపంచం యుద్దం చేస్తోంది. అనేకానేకులు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి గురై కొలుకోగా, లకలాధి మంది మాత్రం అసువులు బాసారు. దీంతో అసలు కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. ఒకరి నుంచి ఒకరికి ఎలా చేరుతుందన్న విషయంపై అద్యయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది అనేక మార్గాల్లో వేగంగా వ్యాపిస్తోందని మరీ ముఖ్యంగా ఒకరినుంచి మరొకరికి నోటి తుంపర్లు ద్వారా, ఒకరు మరోకరిని ముట్టుకోవడం ద్వారా వ్యాపిస్తోందని ప్రాథమికంగా పరిశోధనలు చేసిన అధ్యయానాలు తెలిపాయి.

కాగా కరోనా ఇప్పుడు గాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు తెలిపాయి. అయితే కేవలం ముక్కు, నోటి ద్వారా మాత్రమే ఇన్నాళ్లు ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుందని అద్యయానాలు తెలుపగా, తాజాగా కరోనా మహమ్మారి కంటి ద్వారా కూడా సోకుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కరోనావైరస్ కంటిద్వారా వ్యాపించడం ద్వారా కళ్లకు అత్యంత ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. గాలిలో వున్న కరోనా కణాలు కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని, అయితే ఇవి కళ్లలోని కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపి కంటి చూపును కూడా కోల్పోయేలా చేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

కరోనాతో కంటికి ముప్పు మాత్రమే కాదు.. కంటిలోని కణాలను తీవ్రంగా నాశనం చేస్తుందని అంటున్నారు పరిశోధకులు. కరోనావైరస్ కంటి నుంచి శరీరంలోకి సులభంగా ప్రవేశించగలదని చెబుతున్నారు. వైరస్‌ కంటిలోని కణాలను నాశనం చేస్తుందని గుర్తించారు. అమెరికాకు చెందిన మౌంట్‌ సైనాయ్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఈ కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. కంటిలోని స్రావాలను ఆధారంగా చేసుకుని వైరస్‌ శరీరంలోకి ప్రయాణిస్తుందని గుర్తించారు. కంటిలోని కణాల నాశనం చేయడమే కాకుండా ఎసిఈ2 ద్వారా వైరస్‌ శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

కంటిలోని ముందు భాగమైన లింబస్‌ వైరస్‌కు ఎక్కువగా ప్రభావితం అవుతుందని గుర్తించారు. అయితే కంటిలోని కార్నియాకు తక్కువ ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ముఖంలోని ప్రతి భాగం వైరస్‌ను శరీరంలోకి పంపేందుకు వాహకంగా మారుతుందన్నారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, ముఖం భాగాన్ని తాకకుండా ఉండాలని సూచించారు. ఫేస్‌ షీల్డ్‌ల వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. విట్రో స్టెమ్‌ సెల్‌ నమూనాలను వినియోగించారు. కరోనా బారిన పడిన వారి నుంచి నమూనాలను సేకరించారు. ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ చేయగా కంటిలోని లోపలి కణజాలంపై వైరస్‌ ప్రభావాన్ని గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles