Live-in relationship morally and socially not acceptable: HC సహజీవనంపై హర్యానా, పంజాబ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Live in relationships unacceptable morally or socially punjab and haryana high court

punjab and haryana high court, punjab and haryana high court judgement, live in relationship, live in relationship validity, live in relationship punjab and haryana high court, justice hs madaan, live in relationship india, live in relationship law india, Hariyana High Court, Judgement, marriage, punjab

Live-in relationships are socially and morally not acceptable, the Punjab and Haryana High Court recently observed, declining to grant protection to a couple who claimed that they apprehended danger from their parents. Single-judge Justice HS Madaan turned down the plea by Gulza Kumari and Gurwinder Singh who said that they are in a live-in relationship and intending to get married.

సహజీవనంపై హర్యానా, పంజాబ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Posted: 05/18/2021 11:25 PM IST
Live in relationships unacceptable morally or socially punjab and haryana high court

సహజీవనం గత రెండుదశాబ్దల కాలంగా అధికంగా వినిపిస్తున్న పదం ఇది. అయితే ఒక్క పదమే కదా అని ఈజీగా తీసుకునే విషయం కాదిది. దేశీయ సంస్కృతి. సంప్రదాయాలు, వైవాహిక జీవన విధానాలపై ఈ ఒక్క పదం ఎంతటి ప్రభావం చూపుతుందో తెలిసిందే. సాఫ్ట్ వేర్ సంస్థలు, బహుళజాతి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో నగరంలో ప్రారంభమైన ఈ సంస్కృతి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎగబాకింది. గ్రామాల్లోని యువత కూడా సహజీవన విధానానికి అకర్షితులై భారతీయ వివాహబంధానికి వున్న విశిష్టతను కాలరాస్తున్నారు. తాజాగా పంజాబ్, హరియాణాలకు చెందన చండీగర్ హైకోర్టు సహజీవనంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని పేర్కోంది. సమాజం ఇలాంటి బంధాలను గుర్తించదని తెలిపింది. భార్యభర్తలై ఆలుమగలు చేసుకోవాల్సిన అన్ని పనులను సహజీవనం పేరుతో చేసుకని.. ఆ తరువాత అన్యాయం జరిగిందంటే ఎవరు బాద్యులని న్యాయస్థానం ప్రశ్నించింది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును గుల్జాకుమారీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గా గుర్తింపు పోందింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన గుల్జా కుమారి(19), గురువిందర్‌ సింగ్‌(22) ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొద్దీ రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఇద్దరు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే సహజీవనం చేస్తున్నారు.

వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే గుల్జా కుమారి కుటుంబం అందుకు వ్యతిరేకంగా వున్నారు. దీంతో తన కుటుంబసభ్యులు తమను వీడదీయడంతో పాటు తమ ప్రాణాలకు హాని కూడా తలపెట్టవచ్చునని గుల్జాకుమారీ చండీగడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పిస్తూ లివ్‌ ఇన్‌ రిలేషన్‌కు ఆమోదముద్ర వేయాలని కోరారు. అయితే వీరి పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని జస్టిస్‌ హెచ్‌ఎస్‌ మదాన్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక ఇటీవల సహజీవనం చేస్తున్న ఓ జంట కూడా తమకు రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. సహజీవనాలు సమాజంలో వివాహబంధానికి వున్న ఔచిత్యాన్ని కాలరాస్తాయని పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles