Jagga Reddy challenges Talasani on decline in corona cases కేసులు తగ్గినట్టు నిరూపిస్తావా.? తలసానికి జగ్గారెడ్డి సవాల్.!

Jagga reddy challenges minister talasani on decline in corona cases

Jagga reddy, JayaPrakash Reddy, Sangareddy MLA, Talasani Srinivas Yadav, Minister, coronavirus, corona deaths, corona cases, Remidesivir, Oxygen concentrators, BJP MPs, Narendra Modi, Telangana, Politics

Congress Senior Leader and Sangareddy MLA Jagga Reddy challenges Minister Talasani Srinivas Yadavv on decline in corona cases in the state. He suggest not to make comedy with the people of Telangana.

కేసులు తగ్గినట్టు నిరూపిస్తావా.? తలసానికి జగ్గారెడ్డి సవాల్.!

Posted: 05/17/2021 09:48 PM IST
Jagga reddy challenges minister talasani on decline in corona cases

తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గముఖం పట్టాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు మంత్రి తలసాని నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. కరోనాతో తెలంగాణ ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టినట్టులేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రోజువారీ మరణాలను 40-50గా చూపిస్తోందని, కానీ రాష్ట్రంలో రోజూ 200కి పైగా మంది చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పతుల్లో ప్రజలు వేల సంఖ్యలో మరణిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు.

రాష్ట్రంలో రెమిడెసివీర్ కొరత ఎక్కువగా ఉందని.. కరోనా రోగుల బంధువులు మూడు నుంచి ఐదు వేల రూపాయల ఈ మందును ముప్పై నుంచి యాభై వేలు రూపాయలను వెచ్చింది బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారని, రెమిడెసివీర్ మందును బ్లాక్ లో కొనుగోలు చేద్దామని ప్రయత్నిస్తున్నా దొరకడం లేదనా అన్నారు. రాష్ట్రానికి వస్తున్న రెమిడెసివీర్ మందు నేరుగా బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్తుందని అరోపించారు. తెలంగాణలో తయారయ్యే రెమిడెసివిర్‌కు ఇక్కడే కొరత ఏర్పడటం ఏంటో అంతుబట్టడం లేదన్నారు. రెమిడెసివర్ విషయంలో తెలంగాణకు మొక్కుబడిగా కేటాయింపులు జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు,

కరోనా వాక్సీన్, రెమిడెసివీర్ మందుల కోరత నేపథ్యంలో కట్టుకథలు చెబుతున్న బీజేపీ ఎంపీలు.. ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు నిలదీయడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రెమిడెసివీర్ ను కూడా కొంచెం కొంచెం ఇవ్వడానికి ఇదేమైనా దేవుడి ప్రసాదమా? అని ఎద్దేవా చేశారు. కరోనా మెడిసిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ సరఫరా చేసి ఇతర రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కూర్చుని రాష్ట్రమంతా పచ్చగా ఉందని అనుకుంటున్నారని విమర్శించారు.

తలసాని అంత గొప్పవాడే అయితే కిషన్ రెడ్డి ఇంటి వద్ద కూర్చుని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన మందులను రాబట్టుకోవాలని అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తుంటే రాష్ట్ర సీఎస్ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఫార్మా ఓ మాఫియాలా తయారైందని అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తుంటే విజిలెన్స్ విభాగం ఏంచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దగ్గర మంచిపేరు తెచ్చుకునేందుకు భజన చేయడం మానేసి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles