కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా పెద్ద రోగం కాదని.. కేవలం అంటువ్యాధి మాత్రమేనని పలువురు రోగులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నావాస్తవానికి మాత్రం కరోనా నుంచి అప్రమత్తత ఎంతో అవసరమని దాని బారిన పడిన రోగుల అభిప్రాయం. కరోనా మహమ్మారిని నయం చేయడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కరోనా బాధితులను కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇక కరోనా తొలిధశ కన్నా రెండో దశ మరింత ఉద్దృతంగా తన ప్రభావాన్ని చాటుతుందని ఇప్పటికే వైద్యులు చెబుతున్నారు.
అందుకు కరోనా సెకెండ్ వేవ్‌లో దేశంలో పరిస్థితి మరింత దిగజారడమే కారణంగా పేర్కొంటున్నారు. కరోనా రెండో దశను కట్టడి చేయడానికి ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే ముందుకు మద్యం దుకాణాల వద్దకు మందుబాబులు బారులు తీరారు. సామాజిక దూరం గాలికి వదిలి నెట్టుకుంటూ మద్యం కొనుగోలు చేయడంలో పోటీపడ్డారు. ఇలా కొందరు కరోనా విషయంలో తమ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక వైద్యురాలు కరోనాను తేలికగా తీసుకోకూడదంటూ అందించిన సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఢిల్లీకి చెందిన డాక్టర్ దీపికా అరోరా చావ్లా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళే ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోకూడదని, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలని, సామాజిక దూరాన్ని తప్పక పాటించాలని ఆమె కోరారు. కరోనా రోగులకు చికిత్స చూస్తూన్న అమె కరోనా బారిన పడ్డారు. అయితే తాను గర్భవతినన్న విషయం తెలిసిన అమె అన్ని రకాలా జాగ్రత్త చర్యలు పాటిస్తూనే వున్నా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అమె కరోనా ప్రభావానికి గురయ్యారు. ఏప్రిల్ 11 న డాక్టర్ దీపిక కరోనా బారిన పడగా, ఏప్రిల్ 26 న ఆమె కన్నుమూశారు.
తన భార్య అందించిన చివరి వీడియోను భర్త రవీష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో కొట్టుమిట్టడుతున్న సమయంలో తన భార్య తన గురించి, తమ మూడేళ్ల కుమారుని గురించి తపించిపోయారన్నారు. అలాగే ఆమె కడుపులో ఉన్న శిశువు గురించి కూడా వేదన చెందారన్నారు. కాగా భార్యను, పుట్టబోయే బిడ్డను కోల్పోయిన రవీష్... మరెవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ ఆమె చివరి వీడియోను సోషల్ మీడియలో షేర్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more