Peddapalli ZP Chairman Putta Madhu Arrested In Bhimavaram పుట్టా మధు అరెస్ట్.. భీమవరంలో పోలీసుల అదుపులోకి..

Peddapalli zp chairman putta madhu arrested in bhimavaram

Putta Madhu, Putta Madhu Arrested, Peddapally ZP Chairman, Peddapalli Zilla Parishad, Telangana lawyer murder, Telangana lawyer killings, Lawyer couple murder, Telangana HC, Telangana, CRIME

The whereabouts of Peddapalli ZP chairman Putta Madhu, who has been missing for the past few days, has finally been found. He was arrested by the Ramagundam Task Force in Bhimavaram, West Godavari district. From there he moved to Ramagundam. The news is confirmed by the police.

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్.. భీమవరంలో పోలీసుల అదుపులోకి..

Posted: 05/08/2021 08:33 PM IST
Peddapalli zp chairman putta madhu arrested in bhimavaram

పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న విషయం తెలిసిన ఆయన గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతోని ఉండటంతో ఆయన ఎక్కుడున్నారనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు శ్రమపడాల్సి వచ్చింది. కాగా, పుట్టా మధును పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరం నుంచి ఆయనను హైదరాబాదుకు తరలిస్తున్నారు. మరోవైపు, ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

న్యాయవాది వామన్ రావు ఆయన సతీమణి పివీ నాగమణి.. దంపతుల హత్య కేసులో మధు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సుమారుగా మూడు నెలల క్రితం మంథని వద్ద జరిగిన ఈ హత్యకేసులో పుట్టా మధు మేనల్లుడు బిట్టుశ్రీనుతో పాటు ఆయన అనుచరులు కుంటా శ్రీను సహా ఇద్దరిని అరెస్టు అయ్యారు. ఆయన అనుచరులు, మేనల్లుడు బిట్టుశ్రీను విచారణలో వెల్లడించిన వివరాల నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులు హత్యకేసులో పుట్టా మధు ప్రమేయం ఏమైనా వుందా.? లేక మరో కేసు విషయంలో ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాదుకు తరలిస్తున్నారా.? అన్న వివరాలు తెలియాల్సి వుంది.

ఇదిలావుండగా వామన్ రావు దంపతుల హత్యకేసులో పుట్టా మధును అదుపులోకి తీసుకున్నారన్న వార్తల నేపథ్యంలో మరో చర్చ తెరపైకి వస్తోంది. గత మూడు నెలలుగా మీనమేషాలు లెక్కబెట్టిన పోలీసులు ఉన్నపళంగా ఈటెల ఎపిసోడ్ తెరపైకి వచ్చిన తరువాత పుట్టామధు అరెస్టు చేయడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత ఆయనతో సన్నిహిత సంబంధాలు వున్న పుట్టా మధును కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుట్టామధు.. ఈటలతో కలిసి వ్యాపార లావాదేవీలను కూడా నిర్వహించారని కూడా ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles