Shadow misses for few seconds in rajahmundry రాజమండ్రిలో షాడో మిస్పింగ్.. ఆశ్చర్యపోయిన స్థానికులు

Shadow misses for few seconds in rajahmundry of andhra pradesh

shadow, gurraiah, Geography Lecturer, sun rays, sun light, shadow missing, rajahmundry, common phenomenon, locals shocked, Andhra Pradesh

Shadow misses for few seconds in rajahmundry of Andhra Pradesh leaving locals shocked. Shadow of people, buildings, trees etc is a common pheonmenon with the bright sun light and even in moon light and Electric light in the night.

రాజమండ్రిలో షాడో మిస్పింగ్.. ఆశ్చర్యపోయిన స్థానికులు

Posted: 05/08/2021 06:14 PM IST
Shadow misses for few seconds in rajahmundry of andhra pradesh

జననం నుంచి మరణం వరకు మనిషికి నిత్యం తోడుగా వుండేది నీడ.. అందుకనే కాబోలు సినిమా డైలాగ్ రైటర్లు కూడా నిన్నే కాదు నీ నీడను కూడా కనిపించకుండా చేస్తాను అంటూ పాత సినిమాల్లో డైలాగులు రచించారు. మనిషిని నిత్యం పెనవేసుకునే నీడ ఒక్కసారిగా మాయమైతే.. ఎలా వుంటుంది. ఇదేదో సినిమా స్టొరీ కాదు సుమా. నిజంగా నిజం. సూర్యుడి కిరణాల వెలుతురు ఆధారంగా మనిషి నీడ అందుకు వ్యతిరేక దిశలో పడుతుండటం మనం నిత్యం చూస్తేనే వుంటాం. ఎండలో నిలబడితే చాలు మనిషి తన నీడ గమనించవచ్చు, లేదా సూర్య కిరణాలు పడిన చోటున కూడా నీడ కనిపిస్తోంది.

అంతేకాదు సూర్యడి కిరణాలు నేరుగా పడే భవనాలు, చెట్లు, ఇత్యాదులన్నీ తామ నీడను సూర్యడికి వ్యతిరేక దిశలో పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇంతలా నిత్యం వెంటాడే నీడ ఒక్కసారిగా అదృశ్యమైతే.. అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో మధ్యహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో కొన్ని క్షణాల పాటు నీడ అదృశ్యమైంది. నీడ జాడ లేకపోవడంతో స్థానికులు షాక్ లో మునిగిపోయారు. ఔరా ఇదేలా.. ఇంతటి విచిత్రమేలా.. మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నీడ మాయం కావడమేలా అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

స్థానిక శ్రీసత్యసాయి గురుకులం వైస్ ప్రిన్సిపాల్, భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతికశాఖ అనుబంధ సంస్థ వీఐపీఎన్‌ఈటీ సమన్వయకర్త గుర్రయ్య ఈ విషయమై స్పందిస్తూ..  నీడ అదృశ్యం కావడం ఏడాదిలో రెండు పర్యాయాలు జరుగుతుందని అన్నారు. అయితే దీనికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయన్నారు. ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాల్లో ఏడాదికి రెండుసార్లు ఇలాంటి  ఘటనలు కనిపిస్తుంటాయన్నారు. ఆ సమయాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని చేరుతాయని అందువల్లే నీడ కనిపించదని అన్నారు. సూర్యుడు ఉత్తర, దక్షిణ దిశగా పయనిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయని, ఈ ఏడాది ఆగస్టు 5న కూడా ఇక్కడ ఇలాంటి దృశ్యమే కనిపిస్తుందని గుర్రయ్య వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shadow  sun light  shadow missing  rajahmundry  common phenomenon  Andhra Pradesh  

Other Articles