No lockdown in Telangana: CM KCR clarifies తెలంగాణలో లాక్ డౌన్ విధింపుపై సీఎం క్లారిటీ

Cm kcr clarifies on lockdown shows impact on economy and people in telangana

coronavirus, CM KCR, Lockdown, Economic loss, Oxygen, Remidisiver, Vacine, PM Modi, Piyush goyal, Eastern states, Telangana, politics

Telangana Chief Minister K Chandrashekar Rao asserted that the past experience reveals that lockdown is not an effective measure to control the COVID-19. CM KCR said that the Telangana government has no plans to impose a lockdown which will show its impact on the public and economy.

తెలంగాణలో లాక్ డౌన్ విధింపుపై సీఎం కేసీఆర్ క్లారిటీ

Posted: 05/07/2021 09:51 AM IST
Cm kcr clarifies on lockdown shows impact on economy and people in telangana

రాష్ట్రంలో లాక్ డౌన్‌ విధించే విషయంలో ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ తోసిరాజుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్‌ విధించబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజా జీవనం స్తంభించిపోతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత అనుభవాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా ఉద్ధృతి తగ్గడం లేదని అభిప్రాయపడ్డారు. పలు రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కరోనా ఉద్దృతి తక్కువగానే వుందని ఆయన పేర్కోన్నారు.

రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్లు, రెమ్‌డెసివిర్‌ మందులతో పాటు ఇత్యాధుల సరఫరాల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్‌ ఫోన్ లో మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి అందించాలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌, కర్ణాటకలోని బళ్లారి నుంచి కేటాయించిన ఆక్సిజన్‌ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సరఫరాకు ఏర్పడిన విఘాతాలను తక్షణం పరిష్కరించాల్సిందిగా విన్నవించారు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కరోనా బాధితులు రావడం వల్ల భారం పెరిగిందని ప్రధానికి తెలియజేశారు.

రాష్ట్రానికి ప్రస్తుతం 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుతోందని..  దానిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. అలాగే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు 4900 మాత్రమే అందుతున్నాయని.. వాటిని 25 వేలకు పెంచాలని కోరారు. మరోవైపు కేంద్రం ఇప్పటి వరకు 50 లక్షల కరోనా టీకా డోసుల్ని అందించిందని తెలిపారు. రాష్ట్రంలో రోజుకి 2-2.5 లక్షల డోసుల అవసరం ఉందన్నారు. వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ తో కేసీఆర్‌ మాట్లాడారు. ప్రధాని మోదీకి విన్నవించిన అంశాలన్నింటినీ తక్షణమే తెలంగాణకు సమకూరుస్తామని గోయల్‌ హామీ ఇచ్చారు. ఆక్సిజన్‌ కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి అందేలా చూస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  CM KCR  Lockdown  Telangana  politics  

Other Articles