EC bans Himanta Biswa Sarma from campaigning హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

Assam Elections 2021, Himanta Biswa Sarma, Sushanta Biswa Sarma Goalpara SP, 2021 Assam Elections, Election Commission, Himanta Biswa Sarma Ban, Himanta Biswa Sarma Ban By Election Commission, EC Ban on Himanta Biswa Sarma, ban from campaining, sushanta biswa sarma, goalpura, Assam Elections 2021

After barring Assam minister Himanta Biswa Sarma from campaigning in the assembly elections for 48 hours, the Election Commission has also transferred his brother and Goalpara Superintendent of Police Sushanta Biswa Sarma from the district.

హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

Posted: 04/03/2021 01:38 PM IST
Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్ ఆయనకు మరో షాక్ కూడా ఇచ్చింది. ఆ రాష్ట్రంలో పార్టీ కీలక నేత, ప్రచార తార(స్టార్‌ క్యాంపెయినర్‌)గా ఉన్న హిమంత విశ్వశర్మపై అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్న ఎన్నికల కమీషన్.. ఇక ఆ వెనువెంటనే ఆయన సోదరుడికి కూడా షాక్ ఇస్తూ మరో ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.

అసోంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గోంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన హిమాంత విశ్వశర్మపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటూ.. ఆయనను రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలు శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. దీంతో ఈ అదేశాల ఆదివారం రాత్రి వరకు కొనసాగనున్నాయి. అయితే అదివారం సాయంత్రం ఐదు గంటలకే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారానికి ఇక తెరపడినట్టే. హిమంత  ప్రచారానికి  రెండు రోజుల ముందుగానే ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.

బోడోలాండ్‌ నేత హంగ్రామా మొహిలరీకి జైలు శిక్ష తప్పదని హిమంత విశ్వ శర్మ ఇటీవల జరిగిన ఓ సభలో హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. కోక్రాజర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల కేసుని ఎన్ఐ‌ఏకి అప్పగించామని తెలిపారు. హంగ్రామా సహా బోడోలాండ్‌ ప్రాంతంలో అలజడులు సృష్టించడాన్ని సహించబోమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొహిలరీని జైలుకు పంపుతామని బహిరంగంగా బెదిరించారని తెలిపారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం రెండు రోజుల నిషేధం విధించాలని నిర్ణయించింది.

ఇక ఇలా క్రితం రోజు రాత్రి అదేశాలను జారీ చేసిన ఎన్నికల సంఘం.. తమ అదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. అదే సమయంలో వెనువెంటనే ఆయనకు మరో షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఆయన సోదరుడు ఐపీఎస్ అధికారి సుషాంత విశ్వశర్మపై కూడా బదిలీ వేటు వేసింది. గోల్ పురా జిల్లా ఎస్పీగా వున్న ఆయనను రాష్ట్ర హెడ్ క్వార్టర్ కు తరలిస్తూ అదేశాలను జారీ చేసింది. ఇక ఈ స్థానంలో వీర వెంకట రాకేశ్ రెడ్డిని జిల్లా ఎస్సీగా బాధ్యతలు చేపట్టాలని అదేశాలను జారీ చేసింది. 126 స్థానాలున్న అసోంలో మార్చి 27న తొలి విడత, ఏప్రిల్‌ 1న రెండో విడత పోలింగ్‌ పూర్తయింది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles