Rajasthan launches health insurance scheme for all రాష్ట్ర ప్రజలకు మరో పథకం.. తొలి రాష్ట్రంగా రాజస్థాన్ రికార్డు.!

Rajasthan becomes first state to provide health insurance for all its residents

Rajasthan health scheme, Rajasthan health insurance, Rajasthan Ashok Gehlot, Rajasthan health insurance scheme chiranjeevi,Rajasthan,Politics

Rajasthan on Thursday kicked off its cashless ‘mediclaim’ scheme worth Rs 5 lakh for each family of the state, starting the registration for its Chiranjeevi Health Insurance Scheme.

రాష్ట్ర ప్రజలకు మరో పథకం.. తొలి రాష్ట్రంగా రాజస్థాన్ రికార్డు.!

Posted: 04/01/2021 06:38 PM IST
Rajasthan becomes first state to provide health insurance for all its residents

ప్రతీ పౌరుడికి కూడు, గూడు, గుడ్డ కల్పిస్తామన్న అభయంతో దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్.. తాము అధికారంలో వున్న రాష్ట్రంలో మారుతున్న జనజీవన విధానాలకు అనుగూణంగా పథకాలను మార్చుతూ రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకుంటోంది. ఓట్ల కోసం సీట్ల కోసం ఎన్నికలకు ముందు పథకాలను ప్రవేశపెట్టి.. ప్రజలలో ఆ పథకాల పేర్లతో ఓట్లు కురిపించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే వుంటాం. కానీ రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ఇంకా దాదాపు మూడేళ్ల సమయం వున్నా.. ప్రజలకు అత్యంత అవసరమైన అరోగ్య పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి అభయాన్ని అందిస్తోంది.

ప్రజల ఆరోగ్యం కోసం వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో పొందుపర్చడం అవి ఎక్కడ ఖర్చు అవుతున్నాయో.. తీరా తెలియకపోవడంతో.. ఎవర్ని నిందించే పనులకు వెళ్లకుండా ప్రజల అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న పరాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత ‘మెడిక్లయిమ్’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం’ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంతో రాజస్థాన్ రికార్డు సృష్టించింది.

రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అందిస్తున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. పథకంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించిందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ బీమా పథకం కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ నగదు రహిత వైద్య చికిత్సను అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నేటి (ఏప్రిల్ 1) నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles