Pfizer vaccines are 90% effective in 'real-world' study ఉత్తమ ఫలితాలను ఇస్తున్న ఫైజర్,మోడర్నా వ్యాక్సీన్లు

Pfizer moderna covid 19 vaccines highly effective after first shot in real world use study

covid vaccine,covid vaccine efficacy,pfizer covid vaccine efficacy,pfizer efficacy,moderna efficacy,moderna covid vaccine efficacy,modern coronavirus vaccine,pfizer coronavirus vaccine,covid vaccine news,covid vaccine efficacy study, coronavirus, covid-19, covid-19 vaccine, pfizer vaccine, moderna vaccine, vaccine effectiveness, health

Two doses of either the Pfizer or Moderna COVID-19 vaccine were 90% effective at preventing infection with the coronavirus that causes COVID-19 in a "real world" study of U.S. health care and frontline workers. The study, from the Centers for Disease Control and Prevention (CDC), also found that a single dose of either vaccine was 80% effective at preventing infections with the virus.

ఉత్తమ ఫలితాలను ఇస్తున్న ఫైజర్,మోడర్నా వ్యాక్సీన్లు: అమెరికా అధ్యయనం

Posted: 03/30/2021 04:50 PM IST
Pfizer moderna covid 19 vaccines highly effective after first shot in real world use study

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వయోవృద్దులు, ఫ్ఱంట్ లైన్ వారియర్స్ కు ఇప్పటికే టీకాను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. ప్రజలందరినీ కరోనా నుంచి రక్షణ పోందేందుకు వ్యాక్సీలను తీసుకోవాలని కోరింది. కాగా తొలినాళ్లలో వ్యాక్సీన్ల ప్రభావం ఎంతమేరకు వుందన్న వివరాలు తెలియకపోవడంతో పాటు తీసుకున్న ఒకరిద్దరిలో దుఫ్ఫ్రభావాలు బయటపడటంతో పూర్తి సత్ఫలితాలను ఇచ్చే వాక్సీన్లు వచ్చే వరకు వేచి చూద్దామని పలువురు భావిస్తున్నారు. అయితే మన దేశంలో రూపోందని టీకాలన్నీ మంచి ఫలితాలనే అందిస్తున్నాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలో పలు టీకాలు కూడా త్వరలోనే దేశ ప్రజల అందుబాటులోకి రానున్నాయి. కాగా  బయోఎన్ టెక్ ఎస్, మోడెర్నా సహకారంతో ఫైజర్ సంస్థ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యుత్తమంగా పనిచేస్తోందని యూఎస్ హెల్త్ కేర్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకా తీసుకున్న వారిలో రెండు వారాల్లోనే కరోనా సోకే అవకాశాలు 80 శాతం మేరకు తగ్గాయని, తొలి దశ టీకా తీసుకున్న వెంటనే యాంటీ బాడీలు పెరుగుతున్నాయని అధ్యయనం పేర్కొంది. రెండో షాట్ తీసుకున్న రెండు వారాలకు ఇన్ఫెక్షన్ రిస్క్ 90 శాతం తగ్గిందని, దాదాపు 4 వేల మందిని పరిశీలించి ఈ అధ్యయనం చేశామని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.

ఈ వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షణ కల్పించడంతో పాటు, వైరస్ శరీరంలోకి వెళితే, లక్షణాలను కూడా బయటకు కనిపించనివ్వడం లేదని వెల్లడించింది. అమెరికాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ మంచి ప్రభావాన్ని చూపుతూ, ప్రజలను కరోనాకు దూరం చేస్తోందని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఫైజర్ సంస్థ మెసింజర్ ఆర్ఎన్ఏ విధానంలో వ్యాక్సిన్ ను రూపొందించిందని గుర్తు చేసిన ఆయన, అమెరికాలో ఈ వ్యాక్సిన్ కే తొలుత వాడకానికి అనుమతి లభించిందని తెలిపారు.

డిసెంబర్ 14 నుంచి 13 వారాల పాటు సాగిన ఈ అధ్యయనం, మార్చి 13 వరకూ సాగిందని, మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి టీకా తీసుకున్న వారిలో 3,950 మందిని పరిశీలించామని సీడీసీ పేర్కొంది. ఈ టీకా అమెరికాలోని హెల్త్ కేర్ పర్సనల్స్, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్, వయో వృద్ధులకు కొవిడ్ నుంచి నిజమైన రక్షణను అందిస్తోందని వాలెన్ స్కీ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాలో ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం నిమిత్తం వాడేందుకు అనుమతి లభించగా, అప్పటి నుంచి భారీ ఎత్తున ప్రజలకు ఇస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్ ను అత్యంత శీతల ప్రదేశంలో భద్రపరచాల్సి వుండటంతో భారత్ సహా ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ సరఫరా కష్టమన్న ఉద్దేశంతో దూరం పెట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles