Five Maoists killed in Maharashtra Encounter గడ్చిరోలిలో భీకర ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోల మృతి

Gadchiroli encounter 5 suspected maoists killed in maharashtra

Maoists, two women Maoists, Khobramendha jungle, anti-Naxalite squad, Kurkheda tehsil, Gadchiroli, Chhattisgarh, Maharashtra, crime

At least five suspected Maoists, including two women, were gunned down in an exchange of fire with police in Khobramendha jungle under Kurkheda tehsil in Gadchiroli district, bordering Chhattisgarh, approximately 350km from Nagpur on Monday morning.

గడ్చిరోలిలో భీకర ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోల మృతి

Posted: 03/29/2021 04:59 PM IST
Gadchiroli encounter 5 suspected maoists killed in maharashtra

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మహారాష్ట్ర-ఛత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. సరిహద్దు ప్రాంతంలోని ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య గంట పాట భీకర ఎదురు కాల్పులు జరిగాయి. నాగ్ పూర్ నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న యాంటీ నక్సల్ స్వాడ్ కు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.

ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా ఐదుగురు మావోలు మాత్రం హతులయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు వున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గడ్చిరోలి రేంజ్ డిఐజీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. కుర్ ఖేడా పోలిస్ స్టేషన్ కు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అందులో మావోయిస్టులు ఇవాళ కోబ్రామెండ అటవీప్రాంతంలో ఓ శిక్షణా క్యాంప్ నిర్వహిస్తున్నారని సమాచారం అందిందని.. దీంతో పోలీసు విభాగానికి చెందిన స-60 జవాన్ల బృందంతో పాటు యాంటీ నక్సల్ స్వాడ్ సంయుక్తంగా కూంబింగ్ చర్యలకు దిగాయని తెలిపారు.

ఇలా కూంబింగ్ చేస్తున్న పోలీసులను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపాగా. వెంటనే తేరుకున్న పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. అయితే రెండు వర్గాల మధ్య సుమారుగా గంట పాటు భీకర కాల్పులు చోటుచేసుకున్నాయని, అయితే పలువురు మావోయిస్టులు ఈ క్రమంలో తప్పించుకున్నారని, కాల్పులు అగిన తరువాత ఘటనాస్థలంలో ఐదుగరు మావోయిస్టులు మరణించి వున్నారని, వారిలో ఇద్దరు మహిళలని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు మావో సాహిత్యం ఇత్యాదులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles