Rape Survivor Tied, Paraded With Her Attacker అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించిన పెద్దలు.. నినాదాలు

Rape survivor tied paraded with her attacker in madhya pradesh shocker

Rape Survivor, Rape Victim, Paraded, Rape Accused, sex assault survivor thrashed, Madhya Pradesh, Crime

In an appalling incident that shows sheer insensitivity against sex assault survivors, a 16-year-old girl, who was allegedly raped in a tribal-dominated village in Madhya Pradesh, was seen being paraded with the accused on Sunday. A disturbing video shows them both tied with ropes as people around chant slogans.

ITEMVIDEOS: షాకింగ్: అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించిన పెద్దలు.. నినాదాలు

Posted: 03/29/2021 02:24 PM IST
Rape survivor tied paraded with her attacker in madhya pradesh shocker

మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఓ పదహారేళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని పోలీసులకు అప్పగించేందుకు బదులు.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న గ్రామ పెద్దలు, కుటుంబసభ్యులు.. అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. అఘాయిత్యానికి గురైన యువతిని అక్కున చేర్చుకుని ధైర్యంగా వుండాలని చెప్పాల్సిన కుటుంబసభ్యులు.. గ్రామ పెద్దలతో పాటు తమ కూతురిని తామే శిక్షించే చర్యలకు పాల్పడటం దారుణం. బాధితురాలికి న్యాయం చేయాల్సిన గ్రామపెద్దలు తెలివిగా ఇద్దరినీ శిక్షించి.. అత్యాచార కేసును లేకుండా చేసే ప్రయత్నం చేశారు.

అత్యాచారానికి గురైన బాధిరాలితోపాటు, నిందితుడిపై కూడా దాడి చేసిన గ్రామస్థులు.. వారి చేతులు కట్టేసి.. గ్రామంలో ఊరేగించిన వైనం కలకలం రేపింది. 16 ఏళ్ల బాధిత మైనర్‌ బాలికతో పాటు, నిందితుడిని తాళ్లతో కట్టేసి దాడిచేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. ఈ ఊరేగింపులో బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం​. గిరుజనుల ప్రాబల్యం అధికంగా వుంటే ప్రాంతంలో అత్యాచార ఘటనలను తెలివిగా తప్పించేందుకు ఇలాంటి ఘగలనకు పాల్పడటం అక్కడి గ్రామపెద్దలకు అలవాటుగా మారింది. ఈ ఘోరానికి  సంబంధించిన వీడియో  వైరల్‌ అయింది.

మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లాలోని గ్రామంలోఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. ఆ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల మైనర్ బాలికపై 20ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక కుటుంబసభ్యులకు తెలియడంతో.. నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన గ్రామపెద్దలు అదే చెట్టుకు బాధిత బాలికను కూడా కట్టేసి కొట్టడం బాధాకరం. ఆ తరువాత వారిని గ్రామంలో ఊరేగిస్తూ భారత మాతాజీ కీ జై అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులతో పాటు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై అత్యాచార ఘటనకు సంబంధించిన ఓ కేసుతో పాటు ఆ తరువాత బాధితురాలిపై దాడి చేసి.. కొట్టిన కుటుంబసభ్యులతో పాటు మరికోందరిపై మరో కేసు నమోదు చేశాయని పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపైన ఒకటి, ఈ దారుణానికి సహకరించిన బాలిక కుటుంబ సభ్యులు, సహా, ఇతరులపై మరో ఎఫ్ఐఆర్ నమెదు చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles