guntur urban sp ammireddy fines thullur traffic circle inspector మాస్క్ ధరించని ట్రాఫిక్ సిఐకి జరిమానా విధించిన ఎస్సీ

Guntur urban sp ammireddy fines thullur traffic circle inspector

Guntur Urban SP, Ammireddy, Special drive, MBT Junction, coronavirus second wave, Thullur traffic inspector, mask, Guntur, Andhra Pradesh, politics

Guntur Urban Superindent of Police Ammireddy had participated in a Special drive at MBT Junction as the corona virus second wave is hitting again and fines thullur traffic circle inspector for not wearing a mask.

మాస్క్ ధరించని ట్రాఫిక్ సిఐకి జరిమానా విధించిన ఎస్పీ

Posted: 03/29/2021 12:27 PM IST
Guntur urban sp ammireddy fines thullur traffic circle inspector

కరోనా వైరస్ మహమ్మారి రెండో దఫా విరుచుకుపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మళ్లీ కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అందరూ మాస్కులు ధరించాలని, ప్రతీ గంటకు చేతులు కడుక్కోవాలని, బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్న కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ.. టీకా వేయించుకున్నవారైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ క్రమంలో మాస్క్ ధరించకుండా రోడ్లపై బాహాటంగా సంచరిస్తున్నవారిపై జరిమానాను విధించింది.

ఇక ఈ క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్న క్రమంలో రాష్ట్రప్రజలందరికీ ప్రభుత్వం కూడా ఈ అంక్ష్లలను అమల్లోకి తీసుకువస్తూ.. మాస్కను తప్పనిసరి చేసింది. ఈ తరుణంలో కంటపడిన తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించారు. ప్రజలు సౌకర్యార్ధం ఫ్రంట్ లైన్ వారియర్ గా వున్న మీరు మాస్క్ ధరించికపోతే.. మీ కుటుంబానికి కూడా ప్రమాదం పోంచి వుంటుందని సూచించిన ఎస్పీ.. స్వయంగా సీఐకి మాస్కు తొడిగారు. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై నిన్న గుంటూరు లాడ్జి, ఎంబీటీ కూడలిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

అదే సమయంలో మాస్క్ ధరించకుండా అటుగా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావును చూసిన ఎస్పీ పిలిచి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. అర్జెంటుగా వెళ్తూ మర్చిపోయినట్టు సీఐ చెప్పారు. వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సీఐకి సూచించారు. మాస్క్ ధరించని సీఐకి జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అనంతరం మాస్క్ తెప్పించి సీఐకి స్వయంగా తొడిగారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles