దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి చాటుకుంటోంది. పాశ్చాత్య దేశాలలో ఇప్పటికే సెకెండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చినా.. భారత్ లో మాత్రం ఇప్పటివరకు క్రమంగా తగ్గిన కరోనా.. తాజాగా విజృంభిస్తోంది. మహారాష్ట్ర మొదలుకుని పంజాబ్, కర్ణాటక, గుజరాత్, ఇలా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వరుసగా రెండవరోజు 40 వేలకు పైన కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో కరోనాపై ఉద్ధృతిపై దృష్టి సారించిన కేంద్రం ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది.
కేంద్రం మార్గదర్శకాలివే..
* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలి.
* పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ లోకి తరలించాలి. ఎవరెవర్ని కలిసారన్న ట్రేసింగ్ చేపట్టాలి.
* పాజిటివ్ కేసులను బట్టి కంటైన్ మెంట్ జోన్లను ప్రకటించాలి.
* కంటైన్మెంట్ జోన్ల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో పొందుపర్చి.. ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు చేయాలి.
* బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టాలి.
* మాస్కులు, సామాజికదూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై అవసరమైతే జరిమానా విధించాలి.
* స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చు.
* అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదు.
* కంటోన్మెంట్ జోన్ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది.
* రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, హోటళ్లు, రెస్టారంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు(ఎస్ఓపీలు) అమల్లో ఉంటాయి. వీటికి లోబడే కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
* ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చైన్‌ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more