Telangana govt shuts down educational institutions in state తెలంగాణలో విద్యాసంస్థల తాత్కాలిక బంద్

Amid covid 19 spike telangana govt shuts down educational institutions in state

Sabitha Indra reddy, telangana schools, educational institutions, medical collages, corona virus deaths, coronavirus, corona second wave, coronavirus latest updates, coronavirus pandemic, coronavirus scare, coronavirus updates, covid, covid 19 deaths, covid scare, covid updates, covid-19, cyber tower, home minister, mohammed mahmood ali, Hyderabad, Telangana, Politics

The Telangana government has decided to close educational institutions in the state from Wednesday due to the spike in COVID-19 cases. Education Minister P Sabitha Indra Reddy announced this in the state Assembly

తెలంగాణ విద్యాసంస్థలన్నీ తాత్కాలికంగా బంద్: సబితాఇంద్రారెడ్డి

Posted: 03/23/2021 03:52 PM IST
Amid covid 19 spike telangana govt shuts down educational institutions in state

తెలంగాణ హోం మంత్రి మహమ్మూద్ అలి రాష్ట్రంలో కరోనా కేసులు అంతా కంట్రోల్ లోనే వున్నాయని లాక్ డౌన్ విధించే అవకాశాలేమీ లేవని తెల్చిచెప్పిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థలను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చినా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమె ప్రకటించారు.

‘‘కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అమె తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలను మూసివేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలన్నీ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఈ మూసివేత ఆదేశాలు వైద్యకళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నింటికీ వర్తిస్తాయని తెలిపారు. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles