Police: Multiple People Killed at Colorado Supermarket పది రోజుల్లో మూడవ కాల్పుల ఘటన.. పది మంది మృతి..

10 killed in colorado supermarket shooting suspect arrested

colarado gun firing, king stopers gun firing, colarado supermarker mass shooting, mass shooting, I-75 highway, public-safety, Robert Aaron Long, southwest Georgia, Asian descent, Atlanta, US Gun Culture, America Gun Culture, Chicago shooting, Chicago gun fire, South Side Gunfire, South Side shooting, gang-related shooting, US shooting, south side gun fire, Party, Chicago shooting, gun fire, South Side, south side gun fire, Party, shooting, Chicago, US, America, Crime

A shooting at a Colorado supermarket killed multiple people Monday, including a police officer, and a suspect was in custody, authorities said. Boulder police Cmdr. Kerry Yamaguchi said at a news conference that the suspect was being treated but didn't give more details on the shooting or how many people were killed.

పది రోజుల్లో మూడవ కాల్పుల ఘటన.. పది మంది మృతి..

Posted: 03/23/2021 12:18 PM IST
10 killed in colorado supermarket shooting suspect arrested

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ విష సంస్కృతి పేట్రేగిపోతుంది. ఈ సంస్కృతిని అంతం చేయాలన్న పాలకుల నిర్ణయాలు.. గాలిమూటలుగానే మారుతున్నాయి. పది రోజుల వ్యవధిలో అగ్రరాజ్యంలో తుపాకీ కాల్పులుకు ఇరవై మంది బలయ్యారు. దాదాపు ఎనమిది రోజుల క్రితం షికాగో నగరంలో జరిగిన ఓ పార్టీలో తుపాకీ కాల్పులు చోటుచేసుకుని ఇద్దరు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఆ వెంటనే రెండు రోజుల వ్యవధిలో అట్లాంటా పరిధిలోని మూడు మసాజ్ కేంద్రాలపై దాడి చేసిన అగంతకుడు తుపాకీ గుళ్లకు ఏకంగా ఏనమిది మంది అసువులు బాసారు.

ఇక తాజా ఘటనలో అమెరికాలోని కోలరాడో రాష్ట్రంలోని బాల్డర్ లో గుర్తుతెలియని అగంతకుడు ఓ స్థానిక సూపర్ మార్కెట్ లోకి చోరబడి అక్కడ షాపింగ్ చేస్తున్న కస్లమర్లపై  విఛక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఏకంగా పది మంది మరణించారు. మృతులో ఒక పోలీసు అధికారి కూడా వున్నారు. కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్ లోని వినియోగదారులు.. ప్రాణభయంతో ప్రాణలు గుప్పుట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కాగా తుపాకీ కాల్పులలో గాయపడి రక్తమోడుతున్న అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలరాడోలోని బౌల్డర్ జిల్లాలో గల కింగ్ స్టాపర్స్ సూపర్ మార్కెట్ లోకి గుర్తుతెలియని అగంతకుడు చోరబడి అక్కడి కస్టమర్లపై విఛక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో బౌల్డర్ పోలీసు విభాగానికి చెందిన 51 ఏళ్ల పోలీసు అధికారి ఎరిక్ టాల్లీ కూడా మృతి చెందాడు. ఆయన 2010లో తమ విభాగంలో చేరారని పోలీసులు తెలిపారు. కాగా రక్తపు గాయాలైన ఓ అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకన్నామని తెలిపారు.

కాగా కాల్పులకు తెగబడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని.. అగంతకుడిని విచారించిన తరువాత ఆ విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కాగా మృతులు ఎంతమంది అన్న విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నామని.. ముందు మృతులను గుర్తించిన తరువాత వారి కుటుంబసభ్యులకు వారి సమాచారం అందించాల్సి వుంటుందని, ఈ క్రమంలో వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు వున్నారని తెలిపారు. ఆ తరువాతే వివరాలను వెల్లడిస్తామని బౌల్డర్ పోలీసులు తెలిపారు. ఇక దాడి జరిగిన ప్రాంతంలో బౌల్డర్‌ పోలీసులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles