Prof Nageshwar alleges BJP behind Surabhi Vani Victory ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభివాణి విజయం వెనుక బీజేపి.?

Bjp behind the victory of surabhi vani in mlc election prof k nageshwar

BJP, MLC Election, Prof K Nageshwar, Surabhi VaniDevi, Ramachandra Rao, Mahabubnagar-Rangareddy-Hyderabad Graduates' constituency, secret understanding, preference vote, Rs 100 Crores, Hyderabad, Telangana, Politics

According to professor K Nageshwar, 48,070 voters gave second preference votes to TRS candidate Surabhi Vani in the election to the Mahabubnagar-Rangareddy-Hyderabad Graduates' constituency after giving first preference to BJP’s N Ramachandra Rao. He said that the BJP leaders have termed him as proxy to Surabhi Vani for dividing the votes of Brahmins.

ITEMVIDEOS: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభివాణి విజయం వెనుక బీజేపి; ప్రో నాగేశ్వర్

Posted: 03/22/2021 03:59 PM IST
Bjp behind the victory of surabhi vani in mlc election prof k nageshwar

రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అని ప్రకటించుకున్న బీజేపి పార్టీ.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయంతో ప్రజల ముందుకు తీసుకువచ్చిన నినాదం పూర్తిగా అసంబద్దమైనదని ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయని ప్రోఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. టైమ్స్ అప్ ఇండియాలో వచ్చిన ఓ కథనంతో ఇది పూర్తిగా రుజువైయ్యిందని ఆయన అన్నారు. బీజేపికి తొలి ప్రాథాన్యత ఓటు వేసిన ఓటర్లలో దాదాపుగా 29 శాతం మంది 40070 మంది టీఆర్ఎస్ పార్టీకి రెండో ప్రాధాన్యత ఓటునే వేశారని అన్నారు.

ఈ లెక్కలతో టీఆర్ఎస్ పార్టీకి బీజేపి ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపి అభ్యర్థి స్వయంగా ఎన్నికల ప్రచారంలో తమకు సురభివాణిదేవి బంధువు అవుతారని చెప్పారని ఆయన అన్నారు. ఇక్కడి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపి టార్గట్ టీఆర్ఎస్ అభ్యర్థి కాదని, ప్రోఫెసర్ నాగశ్వరే్ అన్నారు. తనను మాత్రం అన్ని విధాలుగా బీజేపి శ్రేణులు టార్గెట్ చేశారని, తనను నాస్తికుడు అని మొదలుపెట్టి.. ఆయన హిందూ మత వ్యతిరేకి, ఆయన కమ్యూనిస్టు, అర్బన్ నక్సలైట్, టీఆర్ఎస్ క్యాండేట్, కేసీఆర్ ప్రాక్సీ, బ్రహ్మాణ ఓట్లు చీల్చి నాగేశ్వర్ కు లాభం చేద్దామని టీఆర్ఎస్ ప్లాన్, అంటూ తనపై విమర్శలు గుప్పించిందని అన్నారు.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో రూ.100 కోట్లు ఖర్చ అయ్యిందని.. అది టీఆర్ఎస్ అభ్యర్థి కోసం వెచ్చించారన్న అరోపణలపై నాగేశ్వర్ తనదైన శైలిలో స్పందించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసిన మాట వాస్తవమేనని, అయితే వందలో అరవై కోట్లు టీఆర్ఎస్ పంచితే.. నలబై కోట్లు మాత్రం బీజేపి పంచిందని అరోపించారు. అధికార టీఆర్ఎస్ అందరు ఓటర్లకు పంచుకుంటే వెళ్లగా, బీజేపి సెలక్టడ్ ఓటర్లకు మాత్రమే పంచిందని, ఎందుకంటే వారికి వారి ఓట్లరు ఎవరన్న విషయం తెలుసునని అన్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కు బీజేపి ప్రత్యామ్నాయం అన్న విషయం మాత్రం కోట్టుకుపోయి.. ఇరు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు బహిర్గతమయ్యాయని నాగేశ్వర్ అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  TRS  Prof K Nageshwar  Surabhi VaniDevi  Ramachandra Rao  preference vote  Hyderabad  Telangana  Politics  

Other Articles