Vizianagaram Soldier Poses As Maoist For Extortion డబ్బుకోసం మావోయిస్టు అవతారమెత్తిన ఆర్మీ జవాన్

Inspired by web series army man poses as maoist commander to extort money

Chandanapalli Rajeswara Rao, Army man, Maoist commander, extortion, gold trader, soldier arrested, army man arrested, Vizianagaram, Andhra Pradesh news, Andhra Pradesh crime, Andhra Pradesh, Crime,

A soldier has been arrested for allegedly posing as a Maoist commander to extort money from a gold trader in Parvathipuram town of Andhra Pradesh’s Vizianagaram district. The accused soldier, identified as Chandanapalli Rajeswara Rao, aged 27, told the police that he drew inspiration from a web series to plan the crime.

వెబ్ సిరీస్ ప్రభావం: డబ్బుకోసం మావోయిస్టు అవతారమెత్తిన ఆర్మీ జవాన్

Posted: 03/22/2021 01:01 PM IST
Inspired by web series army man poses as maoist commander to extort money

తాను పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకునేందుకు తీవ్రంగా అలోచిస్తున్న ఓ ఆర్మీ జవానుకు తాజాగా వివాదాస్పదమైన ఓ జాతీయ వెబ్ సిరీస్ అక్రమమార్గంలోనే నడిచేలా ప్రేరేపించింది. అంతే ఆర్మీ జవాను కాస్తా మావోయిస్టు కమాండర్ గా మారాడు. డబ్బుల కోసం ఓ బడా బాబు ఫోన్ నెంబర్ ను సంపాదించాడు. అంతే ఇక అతడ్ని డబ్బు కోసం డిమాండ్ చేశాడు. కట్ చేస్తే డబ్బు తీసుకునే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాల వెనక్కి వెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా వున్నాయి..

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినబంటువానివలసకు చెందిన చందనాపల్లి రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్ లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల 45 రోజుల సెలవుపై గ్రామానికి వచ్చాడు. వస్తూవస్తూ ఉత్తరప్రదేశ్ లో రూ. 30 వేలకు ఓ తుపాకి కొన్నాడు. గతంలో భూదంగాలు చేద్దామని తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టిన రాజేశ్వరావు చేతులు కాల్చకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 లక్షల రూపాయలను పొగొట్టుకున్నాడు. తాను నష్టపోయిన డబ్బులు తిరిగి సంపాదించాలన్న అలోచనతో మదనపడ్డాడు.

అదే సమయంలో కాసింత వివాదాస్పదమైన వెబ్ సిరీస్ మిర్జాపూర్ ను చూస్తుండగా.. అతనిలో వక్రమార్గంలో వెళ్తేనే తన డబ్బులు తనకు వస్తాయన్న అలోచన పుట్టింది. అంతే క్షుణ్ణంగా ప్లాన్ చేసుకుని ఏకంగా మావోయిస్టు కమాండర్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో ఓ బడాబాబును వెతికాడు. అతని ఫోన్ నెంబరుతోపాటు అతని పూర్తి వివరాలను సేకరించాడు. ఈ నెల 6న బంగారం వ్యాపారి బాబు ఇంటికి వెళ్లి ఆయనను బెదిరించాడు. గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి తనను తాను మావోయిస్టు కమాండర్ గా చెప్పుకున్నాడు.

రూ. 5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన వ్యాపారి తాను కోటిన్నర మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. దీంతో ఆ సొమ్ము తీసుకుని పలానా చోటుకి రావాలని చెప్పాడు. సరేనన్న బంగారం వ్యాపారి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు ఆయనకు నకిలీ నోట్లు ఇచ్చి నిందితుడు రమ్మన్న కొండల ప్రాంతానికి పంపించారు. వారు కూడా అక్కడే రహస్యంగా మాటు వేశారు. నిందితుడు రాజేశ్వరరావు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles