BJP workers ransack party office in West Bengal అధిష్టానానికి అల్టిమేటమిస్తున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలు

Bjp workers ransack party office in malda of west bengal demand candidate change

West Bengal Assembly Elections, west bengal BJP activists, BJP Party office vandalised, Maida, Rahul Gandhi, Narendra Modi, Bharatiya Janata Party (BJP), Indian National Congress (Congress), Trinamul Congress, Maldaha, Harishchandrapur, West Bengal, Politics

In a video clip posted by news agency ANI today, Bharatiya Janata Party (BJP) workers were seen vandalising their party office at Malda in West Bengal, demanding a change of candidate from the assembly constituency in the upcoming elections.

ITEMVIDEOS: అధిష్టానానికి అల్టిమేటమిస్తున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలు

Posted: 03/20/2021 11:22 AM IST
Bjp workers ransack party office in malda of west bengal demand candidate change

పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకునేందుకు బీజేపి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ.. తమ చివరి నాలుగు దశలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెలువరించగానే ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా అధిష్టాన నిర్ణయంపై పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని తమ భుజాలపై మోస్తూ వచ్చిన నేతలను కాదని.. రాష్ట్రంలోని అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలను ఎంచుకుని వారికి అసెంబ్లీ బరిలోకి దింపడాన్ని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో తమ నియోజకవర్గాలలో అభ్యర్థులను తక్షణం మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.

అధికార తృణముల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన 22 మందికి టికెట్లు కేటాయించడాన్ని బీజేపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తమ నిరసనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు విధ్వంసమార్గానే అన్వేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రధాన రహదారులపై టైర్లు కాల్చి నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల బీజేపీ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. మరీముఖ్యంగా మైదా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపి కార్యకర్తలు ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోంత పార్టీకి చెందిన కార్యకర్తలే పార్టీ కార్యాలయ సామాగ్రిని ధ్వంసం చేస్తూ రెచ్చిపోవడంతో.. కార్యాలయ సిబ్బంది నిశ్చేష్టులై చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

ఇక ఇలాంటి ఘటనలు మాల్డా, జల్పాయ్‌గురి, ఉత్తర, దక్షిణ పరగణాలు, డమ్‌డమ్, అసన్‌సోల్, హుగ్లీ, హౌరా, అలీపుర్దార్, కూచ్‌బెహర్ జిల్లాల్లోనూ చోటుచేసుకున్నాయి. వలస నాయకులను వద్దని.. స్వతహాగా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన నాయకులకే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం పార్టీ అధిష్టానం అభ్యర్థులను మార్చాలాని ఆందోళనకు దిగారు. దిగి రాకుంటే సొంతపార్టీ అభ్యర్థులను ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం నుంచి నేరుగా కోల్‌కతా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి సీనియర్ నేతల బృందాన్ని రప్పించి అసంతృప్తి రగులుకున్న ప్రాంతాలకు పంపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు నేతలను పిలిచి సమస్యపై చర్చించాలని, పరిస్థితిని అదుపు చేయాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles