Vaccinate all in Maharashtra now, says Anand Mahindra మహారాష్ట్రలో అందరికీ కోవిడ్ టీకా ఇవ్వాలి: ఆనంద్ మహీంద్రా

Anand mahindra has a suggestion as maharashtra battles covid surge again

Ananda Mahindra, vaccination, Coronavirus, Maharashtra, Union Minister Harshavardhan, second wave, Maharashtra, coronavirus, Maharashtra coronavirus, Covid cases in Maharashtra, Coronavirus cases in Maharashtra, Maharashtra news, Maharashtra lockdown, second wave of corona in maharashtra

Industrialist Anand Mahindra took to Twitter to voice his concern about rising coronavirus cases in Maharashtra and suggested that the state needs "emergency permission" to vaccinate everyone willing to take the jab.

మహారాష్ట్రలో అందరికీ కోవిడ్ టీకా ఇవ్వాలి: ఆనంద్ మహీంద్రా

Posted: 03/16/2021 03:55 PM IST
Anand mahindra has a suggestion as maharashtra battles covid surge again

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ.. గత ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నాటి స్థాయికి చేరుకుంటున్న తరుణంలో కేంద్ర అప్రమత్తమై.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి దేశంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు చేసుకుంటున్న మహరాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‘మహారాష్ట్ర’లో కరోనా విజృంభణపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో కరోనా టీకా కావాలన్న ప్రతీ ఒక్కరికి టీకాను కేంద్రం తక్షణం వేయించాలని సూచన చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో ఉద్దృతి కోనసాగకుండా అడ్డుకోవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరికీ టీకాలు ఇచ్చేలా అత్యవసర అనుమతలను తక్షణం కేంద్రం జారీ చేయాలని కేంద్రాన్ని సూచించారు. ‘‘దేశంలో నమోదవుతున్న రోజువారీ కొత్త కరోనా కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన రాష్ట్రాన్ని లాక్ డౌన్లు బలహీనపరిచే అవకాశముందని ఇది ప్రగతికి అవరోధం కలిగించే అవకాశం వుందని అన్నారు.

అంతేకాదు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. ఇక్కడ టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇచ్చేలా అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా విన్నవించారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పదాన కూడా శరవేగంగా సాగుతున్న ఈ క్రమంలో టీకాల కొరత కూడా ఉత్పన్నం కాదని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ను ఆయన ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్‌ పెంచితే సరిపోదని.. కరోనా పరీక్షలు, ట్రేసింగ్‌, చికిత్సలో వేగం పెంచాలని అన్నారు. దీంతో పాటు ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకుని క్రమశిక్షణగా ఉండటం ముఖ్యమని చెప్పారు.

నెటిజన్‌ ట్వీట్‌కు మహీంద్రా బదులిస్తూ.. ‘‘అవును నేనూ ఇందుకు ఒప్పుకుంటాను. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టకపోతే మనం రెండు, మూడు, నాలుగో దశ కరోనా వ్యాప్తితో బాధపడాల్సి వస్తుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో వైరస్‌ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నాగ్ పూర్‌, ఫూణే, హోలియా సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్‌, ఆంక్షలు కోనాసాగుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధలను పాటించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్‌ విధించాల్సి వస్తోందని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles