Chandrababu summoned in Amaravati land scam case అమరావతి పంచాయతీ: చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Andhra cid summons chandrababu asks to appear on march 23 in amaravati land scam

Amaravati, Chandrababu, TDP Chief Chandrababu Naidu, EX CM chandrababu, assigned lands, P. Narayana, Former Minister, Alla RamaKrishna Reddy, AP CID, Summons, Farmers agitations, Decentralisation, CRDA, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The Crime Investigation Department (CID) of Andhra Pradesh which registered an FIR against former Chief Minister Nara Chandrababu Naidu in connection with the ‘Amaravati land scam’ on Tuesday served notices on him at his residence in Hyderabad.

అమరావతిలో అసైన్డ్ భూముల పంచాయతీ: చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Posted: 03/16/2021 01:01 PM IST
Andhra cid summons chandrababu asks to appear on march 23 in amaravati land scam

అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా.? అమరావతి భూములనే టార్గెట్ చేసినా.. విజయవాడలోనూ ఇటీవల జరిగిన పంచాయతీ, పురసాలక సంఘాల ఎన్నికలలోనూ పార్టీని విజయ తీరాలను చేర్చలేపోయిన ఆయన పార్టీ కార్యకర్తలను కుంగుబాటుకు గురికావద్దని చెప్పి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టారు. అయినా.. మాజీ ముఖ్యమంత్రిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టార్గెట్ చేసి.. ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు సిద్దమయ్యారు.

ఈ క్రమంలో అమరావతి భూముల వ్యవహరాల్లో అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి నేరుగా రాష్ట్ర నేరపరిశోధనా విభాగం ఏపీ సిఐడీ అధికారులకు గత నెల ఫిబ్రవరిలో పిర్యాదు చేశారు. దీంతో పాటు పలు ఆధారాలు కూడా సమర్పించడంతో దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సిఐడీ డీఎస్సీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా అమరావతి అసైన్డ్ భూముల వ్యవహరంలో పలు సెక్షన్ల కింద సిఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను కూడా త్వరలో ప్రారంభించనున్నారు.

కేసుల విచారణలో భాగంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడికి సిఐడి అధికారులు ఇవాళ నోటసులు అందజేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానాకి వెళ్లిన సిఐడీ అధికారులు రాజధానిలోని అసైన్డ్ భూముల విషయంలో ఈ నెల 23ను తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కోన్నారు. ఈ మేరకు సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సిఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 23న విజయవాడలోని సిఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని పేర్కోన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పి.నారాయణకు కూడా నోటీసులు అందించామని అధికారులు తెలిపారు. కాగా ఈ కేసుల వ్యవహరాంలో భారత శిక్షాస్మృతి సెక్షన్ 120బి, సెక్షన్ 166, సెక్షన్ 167తో పాటు సెక్షన్ 217 కింద కేసును విచారిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles