Maharashtra in beginning of 2nd Covid wave మహారాష్ట్రకు కేంద్రం లేఖ.. దేశంలో కరోనా రెండో వేవ్..

Maharashtra in beginning of second wave of covid 19 warns central govt team

Maharashtra, coronavirus, Maharashtra coronavirus, Covid cases in Maharashtra, Coronavirus cases in Maharashtra, Maharashtra news, Maharashtra lockdown, second wave of corona in maharashtra

Former MP Konda Vishweshwar Reddy, the second richest among the candidates who contested 2019 Lok Sabha elections in the country has decided to distance himself from the Congress by taking a three-month break.

అలర్ట్: మహారాష్ట్రకు కేంద్రం లేఖ.. దేశంలో కరోనా రెండో వేవ్..

Posted: 03/16/2021 12:07 PM IST
Maharashtra in beginning of second wave of covid 19 warns central govt team

దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా ఆ రాష్ట్రం మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా బాధితులు, మృతులు అధికంగా వున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా కాసింత తగ్గుముఖ పట్టిన కరోనా కేసులు మరోమారు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి నెల మూడోవారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అగస్టు-సెప్టెంబర్ నాటి గణంకాలు దేశంలో నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలోని అన్నిరాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని కేంద్రం అప్రమత్తం చేసింది.

ఇక మహారాష్ట్రలో తాజాగా నమోదైన గణంకాలతో కరోనా ప్రభావం తీవ్రంగా వుందని విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నామని అప్రమత్తం చేసింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని... అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని... ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని లేఖలో.. మహారాష్ట్రలోని శివసేన కూటమి ప్రభుత్వాన్ని రాజేశ్ భూషణ్ హెచ్చరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందని... అయితే, దీనికి తగ్గట్టుగా గట్టి చర్యలను తీసుకోవడం లేదని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నమోదు చేసుకున్న కేసులు మరణాలతో అందోళనకరంగా మారాయని, ఈ పరిస్థితుల నేపథ్యంలో అప్పుడు తీసుకున్న మాదిరిగానే కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ ఏకంగా 131 కరోనా మరణాలు కూడా సంభవించాయి. ఇవాళ దేశంలో 24,492 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో దేశంలో మొత్తంగా 1,14,09,831 మంది కరోనా బారిన పడ్డారు. ఇక మృతుల సంఖ్య ఏకంగా లక్షా 58,856కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles