BJP MP Subramanian Swamy on Vizag steel plant టీటీడీ లావాదేవీలపై కాగ్ అడిట్ కు అంగీకారం..

Bjp mp subramanian swamy meets ap cm ys jaganmohan reddy

BJP, Member of Parliament, Former Union Minister, Subramanian Swamy, Andhra Pradesh, Chief Minister, YS Jaganmohan Reddy, Tirumala Tirupati Devasthanams, Tirupati City Civil Court, TTD,Tirumala, Crime

Former union minister and BJP Member of Parliament Subramanian Swamy met Andhra Pradesh chief minister YS Jaganmohan Reddy. Arriving in Andhra on Wednesday in connection with a case, Swamy met CM Jagan at the Chief Minister's camp office in Thadepalli.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Posted: 03/10/2021 06:50 PM IST
Bjp mp subramanian swamy meets ap cm ys jaganmohan reddy

సొంత పార్టీ నిర్ణయాలను కూడా తనదైన శైలిలో విమర్శించి.. తన వ్యతిరేకతను బాహాటంగానే వినిపించే బీజేపి సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలోనూ తనదైన వ్యతిరేకతను వినిపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదని అన్నారు. ప్రతి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని.. బలమైన కారణాలు ఉంటేనే అలా చేయాలని చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేయాలా? వద్దా? అనే విషయాన్ని కేస్ బై కేస్ చూడాలని అన్నారు.

ఓ కేసు విషయమై ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరుపతి సివిల్ కోర్టుకు హాజరై అక్కడ తన వ్యవహరాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత అమరావతికి చేరుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇవాళ తాడెపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురు నేతలు కొంతసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వామిని జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనను శాలువాతో సత్కరించి, తిరుమల వేంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, టీటీడీ లావాదేవీలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు.

స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోదీతో జగన్ చర్చలు జరుపుతారని భావిస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్షం, కార్మిక నేతలతో కలుస్తానని జగన్ చెప్పారని అన్నారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు. పెట్రో ధరల పెరుగుదల సామాన్యుల పాలిట పెను భారంగా పరిణమించిందని విమర్శించారు. టీటీడీని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలని... ప్రజలే దాన్ని నడిపించేలే చేయాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు హయాంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగినట్టు స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles