Tirath Singh Rawat sworn-in-as new Chief Minister ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంతిగా తీరత్ సింగ్ రావత్

Tirath singh rawat sworn in as new chief minister of uttarakhand

Tirath Singh Rawat, Uttarakhand Chief Minister, Trivendra Singh Rawat, Uttarakhand, uttarakhand Governor, Baby Rani Maurya, uttarakhand news, new cm of uttarakhand, cm of uttarakhand, uttarakhand cm trivendra singh rawat, uttarakhand cm news, uttarakhand new cm

Tirath Singh Rawat will take over as the new Chief Minister of Uttarakhand, with just a year to the state election, after the resignation of Trivendra Singh Rawat, today in the Raj Bhavan

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంతిగా తీరత్ సింగ్ రావత్

Posted: 03/10/2021 04:31 PM IST
Tirath singh rawat sworn in as new chief minister of uttarakhand

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఐదేళ్ల కాలం పాటు వారు కోనసాగకుండా.. ఆ స్థానంలో మరో నేత ముఖ్యమంత్రిగా బదలింపుకు నోచుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకీ క్రమేనా దూరం కాగా, తాజాగా బీజేపి పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో అది పునారావృతం అయ్యింది. సొంతపార్టీ నేతల అసమ్మతి సెగతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని వీడగా.. ఆ స్థానంలో బీజేపి పౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ తీరత్‌ సింగ్‌ రావత్‌ ఇవాళ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.

రాజ్ భవన్ లో గవర్నర్ బేబి రాణి మౌర్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న విషయమై బీజేపి శాసనసభాపక్షం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో తీరత్‌ను నూతన ముఖ్యమంత్రిగా పార్టీ ఎన్నుకుంది. అంతకుముందు సీఎం రేసులో ఎమ్మెల్యే ధన్‌సింగ్‌ రావత్‌, కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తదితర ప్రముఖుల పేర్లు వినిపించినా.. వారిందరినీ తోసిరాజుతూ అనూహ్యంగా తీరత్‌ ముందుకుదూసుకువచ్చారు. దీంతో పార్టీ అధిష్టానం అతనివైపే పార్టీ మొగ్గుచూపింది.

దీంతో రాష్ట్ర తొమ్మిదో ముఖ్యమంత్రిగా తీరత్‌ సింగ్‌ రావత్‌ చేత గవర్నర్ బేబి రాణి మౌర్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇక ఆయన అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలను చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రతీ బీజేపి నేతను కలుపుకుని తాను ముందుకు నడుస్తానని అన్నారు. కాగా, త్రివేంద్ర సింగ్ రావత్ పై అసమ్మతి గళం విప్పిన పలువురు పార్టీ నేతలు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో.. అసమ్మతి సెగ ఇంకా రాజుకుంటూనే వుందా..? లేక చల్లారిందా.. అన్న విషయాలు తెలియాల్సి వుంది.

56ఏళ్ల తీరత్‌.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని పౌరిగఢ్వాల్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013-15 మధ్య బీజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో చౌట్టఖల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్ధిపై ఏకంగా 3.5లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.  సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. అధిష్ఠానం పిలుపు మేరకు గత సోమవారం ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత మంగళవారం  త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామాను ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles