Women's March towards Durga temple foiled అమరావతి మహిళా రైతుల అరెస్టు

Capital amaravati women s march towards durga temple in vijayawada foiled

Amaravati, Women activists, Vijayawada Durga Temple, slogans, Anti Govt protest, Indrakeeladri, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, United Nations Human Rights Council,united kingdom,law,kaveti srinivas rao,International Criminal Court,DecisionAmaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Police foiled the attempt made by Amaravati farmers to offer prayers at the Kanaka Durga temple abode Indrakeeladri. When several hundred women from the villages of capital region reached near the Prakasam barrage, the police in Tadepalli foiled their march and arrested them.

దుర్గమ్మ గుడికి ర్యాలీగా వెళ్లిన అమరావతి మహిళా రైతుల అరెస్టు

Posted: 03/08/2021 12:31 PM IST
Capital amaravati women s march towards durga temple in vijayawada foiled

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ అర్థర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రైతులు విజయవాడ ఇంధ్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ దేవాలయం వద్దకు ర్యాలీగా చేరాలని ఇచ్చిన పిలుపును పోలీసులు అడ్డుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి ర్యాలీగా వెళ్తున్న మహిళలను పోలీసులు ప్రకాశం బ్యారేజీపై అడ్డుకుని నిర్భంధించారు. దీంతో బ్యారేజీపైనా బైఠాయించిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ నిర్ణయం తీసుకుని అమరావతి సీఆర్డీఏను రద్దు చేస్తారని ఊహాగానాలు వచ్చిన నాటి నుంచి అలాంటి చర్యలు చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ తాము అందోళనలు చేస్తున్నామని వారు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం తమ దీక్షలు, నిరసనలను.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ మొర వినడం లేదని, తమను, తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని అమరావతి రైతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావాతి ప్రాంత రైతులు, మహిళలు, విద్యార్థులు కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా బయలుదేరారు.

వీరిని పోలీసులు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను ప్రకాశం భ్యారేజీ సీడ్ యాక్సిన్ రో్డ్డుపై నుంచి మంగళగిరి, తాడేపల్లి పోలిస్ స్టేషన్లకు తరలించారు. ఈ విషయం తెలిసిని అమరావతి ప్రాంత వాసులు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయపూడి నుంచి మందడం వస్తున్న రైతుల్ని పోలీసులు వెలగపైడీ వద్ద అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి రాకపోకల్ని నిలివరించారు. మహిళలు కూడా రోడ్డుపై భైఠాయించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో మహిళలు ఉదయం నుంచి రోడ్డపైనే వుండటంతో అందోళనకారులు వారికి అల్పహారాన్ని అందించడం.. దానిని పోలీసులు అడ్డుకోవడంతో రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు క్రిమిసంహారక మందు డబ్బాలను చేతపట్టుకున్నారు. కొంతమంది మహఇళలు వెలగవూడి సచివాలయం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇక ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలను తక్షణం విడుదల చేయాలని అప్పటి వరకు వెనక్కు తగ్గబోమని అమరావతి రైతులు రోడ్డపై బైఠాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles