Vijayasai Reddy comments on Ganta joining into YSRCP గంటా శ్రీనివాస రావు చేరికపై విజయసాయి రెడ్డి స్పందన..

Vijayasai reddy comments on ganta srinivas rao s joining into ysrcp

Ganta Srinivas Rao, TDP MLA, VijaySai Reddy, Rajya Sabha MP, CM Jagan Mohan Reddy, Ganta proposals to Join YSRCP, Chandrababu Naidu, TDP supremo Chandrababu, another shock to Chandrababu Naidu, Urban Local Bodies elections, Renigunta, Renigunta Airport, TDP, YSRCP, Andhra Pradesh, Politics

YSRCP MP Vijayasai Reddy said if CM YS Jagan Mohan Reddy okays accepting the joining of TDP leader Ganta Srinivasa Rao, there will be no second thought on it. He has made these comments after Kasi Vishwanath, a TDP leader, a close follower of TDP MLA Ganta Srinivasa Rao, joined YSRCP in Visakhapatnam.

ITEMVIDEOS: గంటా శ్రీనివాస రావు చేరికపై విజయసాయి రెడ్డి స్పందన..

Posted: 03/03/2021 03:59 PM IST
Vijayasai reddy comments on ganta srinivas rao s joining into ysrcp

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవలంబిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వలసలు వస్తాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి అన్నారు. ఇంకా చాలా మంది పార్టీలో చేరడానికి సెముఖతను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇది ప్రజల్లో వైసీపీ పార్టీ పట్ల అభిమానం.. అప్యాయతకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పార్టీలో కొందరు నాయకులే మిగులుతారు తప్ప.. కార్యకర్తలు ఉండరని అయన పేర్కోన్నారు.

ఈ సందర్భంగా విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీ పార్టీలో చేరే అస్కారముందన్న ఆయన అందుకు ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ అనుమతి తప్పనిసరి అన్న ఆయన.. అమోదం లభిస్తే మాత్రం చేరటం ఖాయమని అన్నారు. గతంలోనే గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరేందుకు పలు ప్రతిపాదనలు పంపారని అయితే ఆ ప్రతిపాదనలను పార్టీ అధిష్టానం పర్యవేక్షిస్తోందని అన్నారు. వీటికి అమోదం లభిస్తే గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి చేరడం ఖయమేనని అంటున్నారు విజయసాయి.

విశాఖ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీవిశ్వానథ్ వైసీపీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా పెద్దసంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయి.. గంటా శ్రీనివాసరావు కూడా వైసీసీ పార్టీ హయంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలను చూసిన ఆయన వైసీపీ పార్టీలో చేరేందుకు అకర్షితులవుతున్నారని అన్నారు. ఇక విశాఖ మేయర్ అభ్యర్థి ఎవరన్న అంశంపై కూడా విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తైన తరువాత దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles