నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడులో 234, అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు చేపడతారు. బెంగాల్ లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు, తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాల్లో, కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాల్లో, అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాల్లో, పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
ఈ వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. పండుగలు, పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించామని వెల్లడించారు. జనవరి నాటికి సిద్ధమైన ఓటరు జాబితాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని వివరించారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు.
షెడ్యూల్ లో ముఖ్యాంశాలు
* మొత్తం ఐదు అసెంబ్లీలలోని స్థానాలు 824
* మొత్తం ఓటర్లు 18.68 కోట్ల మంది
* మొత్తం 2.70 లక్షల పోలింగ్ స్టేషన్లు
* ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితోపాటు నలుగురే పాల్గొనాలి.
* రోడ్ షోలో ఐదు వాహనాలకే అనుమతి
* 80 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం
* కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రం ప్రతి వెయ్యి మందికి ఒకటి ఏర్పాటు. గతంలో1,500 మంది ఓటర్లకు ఒక బూత్ ఉండేది.
* ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్.
* ఈసారి ఎప్పుడు లేని విధంగా ఆన్లైన్ విధానంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పించారు.
* మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నాయి.
* మే 2వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన
* ఐదు రాష్ట్రాలు అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి
అసోం:
మూడు విడతల్లో 126 స్థానాలకు ఎన్నికలు. మార్చి 27వ తేదీన తొలి విడత పోలింగ్ (47 అసెంబ్లీ స్థానాలు). ఏప్రిల్ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడతలకు ఎన్నికలు. 33 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
తమిళనాడు
234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్. 89 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
కేరళ
140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ఏప్రిల్ 6వ తేదీన ఎన్నిక. 40 వేల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ చేపట్టనున్నారు.
పశ్చిమ బెంగాల్
294 స్థానాలతో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్న పశ్చిమబెంగాల్ లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 పోలింగ్ చేపట్టనున్నారు. 8 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
పుదుచ్చేరి
30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్. 1,500 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more