Woman seduces wouldbe Husband to go naked, Blackmails for Money వాట్సాఫ్ కాల్ లో కాబోయే భార్య నగ్నంగా..

Bengaluru woman seduces matrimonial match to go naked blackmails for money

Man stripped naked as woman seduces, woman seduces matrimonial match, woman seduces man on whatsup call, Honey Trap, cyber crime, Bengaluru Woman, Matrimonial Match, Video Call, Public Platform, BlackMail, Money, Extortion, Bengaluru, Crime

A man in Bengaluru, who stripped naked on a video call for a woman, ended up paying Rs 20,000 to her after she recorded the call and threatened to make the clip viral on social media. The man bared himself after the woman asked him to remove his clothes during a video call on WhatsApp.

ఇదో రకం హనీ ట్రాప్: వాట్సాఫ్ కాల్ లో కాబోయే భార్య నగ్నంగా..

Posted: 02/20/2021 06:10 PM IST
Bengaluru woman seduces matrimonial match to go naked blackmails for money

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా, అంటూ శ్రీశ్రీ ఏనాడో చెప్పిన విషయాలు అప్పటి నుంచి ఇప్పటివరకు సాక్ష్యాత్కరిస్తూనే వున్నాయి. అంతకుముందు వున్నా.. ఇకపై కూడా ఉండనున్నా.. ఈ మధ్యకాలంలో మొత్తంగా దగాకోరులే రాజ్యామేలుతున్నారు. ఎవర్ని నమ్మాలో..ఎవర్ని నమ్మకూడదో కూడా తెలియని రోజులు దాపురించాయి. ఇలాంటి ఓ దగాకోరురాలిని నమ్మిన పెళ్లి కావాల్సిన యువకుడు అడ్డంగా బుకైయ్యాడు. డబ్బు మాత్రమే కాదు తన పరువును కూడా అమె చేతిలో పెట్టి.. ఆకులు కాలిన తరువాత ఇప్పుడు పోలీసుల చేతులు పట్టుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాడు.

మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయమైన ఓ యువతిని గుడ్డిగా నమ్మి.. నిట్టనిలువునా మోసపోయాడో యువకుడు. గతంలో పలు పర్యాయాలు సవ్యంగానే సాగిన వారి ఫోన్ సంబాషణలు.. అకస్మాత్తుగా ఓ రోజు మాత్రం అశ్లీలంగా సాగింది. వీడియో కాల్‌లో దుస్తులిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. బెంగళూరు, హులిమావుకు చెందిన 33 ఏళ్ల అంబిత్‌ కుమార్‌ మిశ్రాకు కొద్దిరోజుల క్రితం మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా శ్రేయ అనే యువతి పరిచయమైంది.

తానో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ అని, ఎలక్ట్రానిక్‌ సిటీలో పనిచేస్తున్నానని ఆమె చెప్పిగా అది విన్న అంబిత్ అమెతో పరిచయం పెంచుకున్నాడు. అంబిత్ ను పెళ్లి చేసుకోవాలన్న కోరికను ప్రకటించింది. దీంతో ఇద్దరూ ఫోన్‌ ద్వారా తరచూ మాట్లాడుకునే వారు. ఫిబ్రవరి 7వ తేదీన వాట్సాప్‌ వీడియోకాల్‌ చేయాల్సిందిగా శ్రేయ, అంబిత్ ను కోరింది. సరే అనుకుని చెప్పిన సమయానికి చెప్పినట్టుగా అంబిత్ వీడియో కాల్‌ చేశాడు. మొదట ఇద్దరి ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఇష్టాఇష్టాలు ఇలా కొద్ది సేపు వారి ఫోన్ సంభాషణ సవ్యంగానే సాగింది.

ఆ తర్వాత అవతలి వైపు నుంచి శ్రీయ తన దుస్తులను తీయడం ప్రారంభించింది. అయితే అది చూసి షాక్ కు గురైన అంబిత్.. శ్రీయ ఎం చేస్తుందో తెలుసుకునే లోపు ఆమె తన దుస్తులు మొత్తం తొలగించి నగ్నంగా నిలబడింది. అంతే అంబిత్‌ నోట మాట రాలేదు. దీంతో ఆడపిల్లను తానే ఇలా తయారుకాగా, నువ్వు మాత్రం అలా వున్నావేంటని.. అంబిత్ ను కూడా దుస్తులు తీసేయమని కోరింది. దీంతో శ్రీయ చెప్పినట్లుగానే అతడు దుస్తులు తీసేశాడు. అయితే అప్పటికే ప్లాన్ చేసుకున్న ప్రకారం శ్రీయ అంబిత్ దుస్తులు విప్పడాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేసింది.

ఇంకేముందు వీడియో తీయడం పూర్తకాగానే అతడు తన ట్రాప్ లో పడ్డాడని భావించింది. ఆ తరువాత కొంత సేపటికీ ఫోన్ చేసి.. అంబిత్ ను డబ్బులు అడిగింది. ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్‌ మెయిల్‌ చేసింది. దీంతో అదే రోజు 20 వేల రూపాయలు చెల్లించాడు. ఆమె అంతటితో ఆగలేదు. డబ్బుకోసం మళ్లీ, మళ్లీ ఇబ్బంది పెట్టసాగింది. ఈ నేపథ్యంలో అంబిత్‌ పోలీసులను ఆశ్రయించాడు. శ్రేయపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు పశ్చిమ బెంగాల్ లోని హౌరా నగరం నుంచి ఫోన్‌ చేసినట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles