Covid -ve certificate must for Kerala returnees బెంగళూరుకు వెళ్తున్నారా.? కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ వుందా.?

Travelling to bengaluru restrictions on travel from kerala foreign countries

Bangalore, Bengaluru, Karanataka, Covid-19, RT-PCR negative certificate, Karnataka Covid-19 tally, Bengaluru coronavirus, kerala, foreigners, restrictions, Bommanhalli, RT Nagar, BBMP, Karnataka

The Karnataka government has imposed restrictions on travel on those coming from Kerala. This comes after two clusters were reported in Bengaluru. The state has made an RT-PCR negative certificate mandatory for anyone coming from Kerala.

బెంగళూరుకు వెళ్తున్నారా.? కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ వుందా.?

Posted: 02/18/2021 04:32 PM IST
Travelling to bengaluru restrictions on travel from kerala foreign countries

కరోనా కేసుల నెమ్మదించి.. దేశంలో కరోనా రికవరీ రేటు ఏకంగా 98శాతానికి చేరువలో నమోదు అవుతున్న తరుణంలో మరోమారు కరోనా మహమ్మారి విభృంభిస్తూ అరోగ్య మంత్రిత్య శాఖ సహా వైద్యాధికారులకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తోంది. నిన్నటి వరకు దేశంలో వున్న పరిస్థితలు వేరు. గత 24 గంటల వ్యవధిలో దేశంలో నమోదైన కేసులు గణనీయింగా పెరడటంతో కేంద్ర ఆరోగ్యశాఖ కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అటు మహారాష్ట్ర.. ఇటు కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని వార్తల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అలర్డ్ అవుతున్నాయి.

ఇటు కర్నాటక మాత్రం కేరళ నుంచి వచ్చే వారితో పాటు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులపై కూడా పలు ఆంక్షలు విధిస్తోంది. గ్రేటర్ బెంగళూరు మహానగర పురపాలక సంఘం పరిధిలోని ఆర్టీ నగర్ లో వున్న ఓ నర్సింగ్ కాలేజీలోని 42 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరితో పాటు బొమ్మనహల్లి పరిధిలోని ఒక అపార్టుమెంటులో పార్టీ నిర్వహించడంలో సదరు అపార్టుమెంటులోని 103 మందికి కూడా కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం.. ఇకపై కేరళ నుంచి ఎవరు వచ్చినా వారిపై అంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది.

కేరళకు చెందిన వారు ఎవరైనా తమ రాష్ట్రంలోని రావాలని భావిస్తే వారు తప్పని సరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టును తమ వెంట తీసుకురావాలని అదేశాలను జారీ చేసింది. ఈ రిపోర్టు కేవలం 72 గంటల ముందు తీసుకున్నది అయ్యి వుండాలని తెలిపింది. లేని పక్షంలో కేరళకు చెందిన ఎవరైనా కర్ణాటకలోనికి మరీ ముఖ్యంగా బెంగుళూరు లోనికి ప్రవేశిస్తే వారికి తప్పకుండా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని బెంగుళూరు అధికారులు వెల్లడిస్తున్నారు. అదే సమయంలో ఈ ఆంక్షలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా అమలు అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles